మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హీరో మంచి విష్ణు ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మరో సక్సెస్ అందుకొని తన స్థాయిని పెంచుకోవాలని అనుకున్నాడు. ఎన్నో కథలు వచ్చినప్పటికీ జిన్నా కథ తనకు ఎక్కువగా నచ్చదు అని మంచు విష్ణు పలు ఇంటర్వ్యూలలో కూడా తెలియజేశాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా సన్నీలియోన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించింది.
సినిమాలో విష్ణు చాలా డిఫరెంట్ గా కనిపించాడు. విష్ణు పలు యాక్షన్ సన్నివేశాలలో కూడా డూప్ లేకుండా నటిచ్చినట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఇక ఎంతో కష్టపడి మంచు విష్ణు ఈ సినిమాతో తప్పనిసరిగా సక్సెస్ అందుకుంటాడు అని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా మళ్ళీ ఎప్పటిలాగే బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
జిన్నా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఎక్కువ శాతం అయితే సొంతంగా రిలీజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజు కేవలం 12 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. అయితే సినిమాకు చాలా పాజిటివ్ టాక్ వచ్చింది అని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి రోజే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టారు.
ఇక రెండవ రోజు జిన్నా సినిమా మళ్లీ ఊహించని విధంగా దాదాపు అదే లెక్కలో 10 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. ఇక ఓవర్సీస్ లో కూడా చాలా తక్కువలోనే కలెక్ట్ చేసినట్లు సమాచారం. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 22 లక్షల షేర్ అందుకున్న జిన్నా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 25 లక్షల షేర్ కూడా దాటలేకపోయినట్లుగా తెలుస్తోంది.
సినిమా బిజినెస్ ను బట్టి కనీసం 4.50 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. మరి ఈ రెండు రోజుల కలెక్షన్స్ బట్టి చూస్తే సినిమా ఇంకా నాలుగు కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.