మంచు విష్ణులో హిట్ ఇచ్చిన హుషారు

Update: 2016-04-15 13:30 GMT
మంచు విష్ణు - రాజ్ తరుణ్ లు హీరోలుగా నటించిన ఈడో రకం ఆడో రకం చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కన్ఫూజింగ్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి మౌత్ టాక్ కూడా బాగుంది. ఇప్పటికే ఈడో రకం ఆడో రకం చిత్రాన్ని హిట్ కేటగిరీలో చేర్చేశారు ఇండస్ట్రీ జనాలు.

వరుస ఫ్లాప్స్ తర్వాత మంచి  హిట్ కొట్టడంతో మంచు విష్ణులో హుషారు కనిపిస్తోంది. తన ట్విట్టర్ పేజ్ లో ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు మంచు హీరో. 'వావ్.. ఈడో రకం ఆడో రకంకి వస్తున్న అద్భుతమైన స్పందన ఆనందాన్ని ఇస్తోంది. ప్రతీ చోట నుంచి సూపర్ హిట్ అని రిపోర్టులు వస్తున్నాయి' అంటూ ట్వీట్ చేశాడు విష్ణు. సినిమా హిట్ కి కారణం అంటూ.. అందరినీ పొగడ్తల్లో ముంచెత్తాడు కూడా.

ఈ మూవీకి సక్సెస్ కి ప్రధాన కారణం అనిల్ సుంకర - దర్శకుడు నాగేశ్వరెడ్డి - రాజేంద్ర ప్రసాద్ అంకుల్ - రవి బాబులతో పాటు.. లవ్ లీ లేడీస్ కూడా అని ట్వీట్ చేశాడు మంచు విష్ణు. రాజ్ తరుణ్ ఎనర్జీ లెవెల్స్ ఈ సక్సెస్ లో కీలక అన్న మంచు వారబ్బాయి... రాజారవీంద్ర లేకపోతే.. అసలీ చిత్రం పట్టాలెక్కేదే కాదని తేల్చేశాడు.
Tags:    

Similar News