మంచు ఫ్యామిలీ మెంబర్స్ సినిమాలు తీసినా తీయకపోయినా ఏదోరకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. టాలీవుడ్లో ఆ ఫ్యామిలీ మీద జరిగినంత ట్రోలింగ్ ఇంకెవ్వరి మీదా జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఐతే చాలా సందర్భాల్లో ఈ ట్రోలింగ్‌ను స్పోర్టివ్‌గానే తీసుకున్నారు మంచు ఫ్యామిలీ మెంబర్స్. మంచు మోహన్ బాబు వాడిన 'ఫసక్'.. మంచు లక్ష్మి ఉపయోగించిన 'నిలదీస్ఫై' లాంటి పదాలను వాళ్లే మరింత ట్రెండింగ్‌లోకి తీసుకురావడం గమనార్హం. ఐతే 'మా' ఎన్నికల దగ్గర్నుంచి ట్రోలింగ్ మరీ శ్రుతి మించిపోవడంతో మంచు విష్ణు కొంచెం గట్టిగా రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా తన కొత్త చిత్రం 'జిన్నా'కు సంబంధించి ఒక ప్రమోషనల్మంచు ఫ్యామిలీ మెంబర్స్ సినిమాలు తీసినా తీయకపోయినా ఏదోరకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. టాలీవుడ్లో ఆ ఫ్యామిలీ మీద జరిగినంత ట్రోలింగ్ ఇంకెవ్వరి మీదా జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఐతే చాలా సందర్భాల్లో ఈ ట్రోలింగ్‌ను స్పోర్టివ్‌గానే తీసుకున్నారు మంచు ఫ్యామిలీ మెంబర్స్. మంచు మోహన్ బాబు వాడిన 'ఫసక్'.. మంచు లక్ష్మి ఉపయోగించిన 'నిలదీస్ఫై' లాంటి పదాలను వాళ్లే మరింత ట్రెండింగ్‌లోకి తీసుకురావడం గమనార్హం. ఐతే 'మా' ఎన్నికల దగ్గర్నుంచి ట్రోలింగ్ మరీ శ్రుతి మించిపోవడంతో మంచు విష్ణు కొంచెం గట్టిగా రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా తన కొత్త చిత్రం 'జిన్నా'కు సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో దిగ్గజ దర్శకుడు బాపు సినిమాలో తాను నటించడం కోసం చేసిన ప్రయత్నం గురించి.. ఆయనకు తనకు జరిగిన సంభాషణ గురించి మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై చాలా ట్రోలింగ్ నడిచింది.
ఐతే విష్ణు ఇదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఐతే విష్ణును నెటిజన్లు మాత్రం వదలడం లేదు. తాజాగా 'జిన్నా' హిందీ వెర్షన్ ప్రమోషన్ల కోసం ముంబయికి వెళ్లిన విష్ణు.. బాలీవుడ్లో సినిమాలు చేయడం గురించి అక్కడి మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్లో హిరాని, బన్సాలీ, రోహిత్ శెట్టి లాంటి గొప్ప దర్శకులు ఉన్నారని.. వాళ్లతో సినిమాలు చేయాలనే ఆసక్తి తనకు కూడా ఉందని.. ఐతే వాళ్లతో తాను హిందీ సినిమా చేయడం కంటే వాళ్లు తన దగ్గరికి వచ్చి తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నానని.. తెలుగులో సినిమా చేస్తే ఆటోమేటిగ్గా అది హిందీలోనూ రిలీజై పాన్ ఇండియా స్థాయికి చేరుతుందని విష్ణు వ్యాఖ్యానించాడు.
ఈ వీడియో వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కొన్నేళ్లుగా సరైన విజయం లేక మంచు విష్ణు కెరీర్ బాగా డౌన్ అయిపోగా.. ఇలాంటి హీరోను హిరాని, బన్సాలీ లాంటి లెజెండరీ డైరెక్టర్లు సంప్రదించి తెలుగులో సినిమా తీస్తారా.. ఆశకైనా ఒక హద్దుండాలి.. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాక మరేంటి అంటూ విష్ణు మీద నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
Full View