మంచు విష్ణు ఆశలు వదులుకున్నాడా?

Update: 2020-10-17 07:10 GMT
కెరీర్ ఆరంభంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. మధ్యలో ‘ఢీ’ ఇచ్చిన ఉత్సాహంతో మంచు విష్ణు కెరీర్ గాడిన పడ్డట్లే కనిపించింది. ఆ తర్వాత దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి ఎంటర్టైనర్లతో అతడి కెరీర్ బాగానే సాగుతున్నట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత షరా మామూలే. వరుసగా అతడి సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు పూర్తిగా మార్కెట్ కోల్పోయి.. తనను నిలబెట్టే సినిమా కోసం చూస్తున్నాడతను. ఇలాంటి తరుణంలోనే అతడి నుంచి ‘మోసగాళ్ళు’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ వస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్ చుట్టూ తిరిగే సినిమాగా దీన్ని కొంచెం గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు విష్ణు. జెఫ్రీ జీ చిన్ అనే హాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. చాలా వరకు హాలీవుడ్ టెక్నీషియన్ల సాయంతోనే ఈ సినిమా చేశాడు విష్ణు. ఈ చిత్రం ఇంగ్లిష్‌లో కూడా తెరకెక్కడం విశేషం.

ఐతే ముందు ఇంగ్లిష్‌లోనే అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని విష్ణు ఇంతకుముందు ప్రకటించాడు. పాటలు, సెంటిమెంట్, మసాలా సీన్లన్నీ తీసేసి ఇంటర్నేషనల్ వెర్షన్ వేరే రెడీ చేస్తున్నట్లు కూడా చెప్పాడు. ముందు హాలీవుడ్లో ఈ సినిమాకు ప్రిమియర్ వేసి.. బయ్యర్ల దృష్టిని ఆకర్షించాల్సి ఉందని.. ఆ తర్వాత సినిమాను అక్కడ విడుదల చేస్తామని, తర్వాతే తెలుగు, ఇతర లోకల్ భాషల రిలీజ్ గురించి ఆలోచిస్తామని అన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఇంగ్లిష్ వెర్షన్ గురించి మాట్లాడట్లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. కొన్ని రోజులుగా సినిమాను ఇక్కడ గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నోలన్ సినిమా ‘టెనెట్’కే సరైన ఆదరణ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో విష్ణు సినిమాకు హాలీవుడ్లో ప్రిమియర్లు వేసి, అక్కడి బయ్యర్లను ఆకర్షించి అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయడమంటే మాటలు కాదు. ఇంకో ఏడాది ఎదురు చూసినా అదంత సులువైన విషయం కాదు. అందుకే ఇంగ్లిష్ వెర్షన్ సంగతి పక్కన పెట్టేసి లోకల్‌గా సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
Tags:    

Similar News