తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలుగా కొనసాగుతున్న మంచు కుటుంబానికి షాక్ తగిలింది. అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో దొంగలు పడ్డారు. ఫిలింనగర్ లో ఉన్న ‘మా’ ఆఫీసులో.. ప్రెసిడెంట్ విష్ణు చాంబర్ లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మా అధ్యక్షుడి ఆఫీసులో చోరీపై విష్ణుపై మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.
మంచు విష్ణు మా ఆఫీసులో చోరీపై ఆయన మేనేజర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దొంగలు మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రిని ఎత్తుకెళ్లారు. దుండగులు అపరహరించిన హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి విలువ సుమారు రూ.5 లక్షల వరకూ ఉంటుందని అంచనా..
కాగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీకి సంబంధించి నాగశ్రీను అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇండస్ట్రీలో హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసే నాగ శ్రీను.. విష్ణు ఆఫీసులో చోరీ జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయాడని.. బహుశా అతడే వస్తువులను దొంగిలించి ఉండొచ్చని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు
మంచు విష్ణు మేనేజర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరుస వివాదాలు, వైఫల్యాలకు తోడు ఇప్పుడు చోరీ సంఘటన కూడా మంచు కుటుంబాన్ని కలవరపెట్టినట్లైంది. ఆఫీసులో చోరీ విషయమై మంచు విష్ణు స్పందించాల్సి ఉంది.
ఇక ఈ సామాన్ మంచు మనోజ్ ది అని ఆయన సినీ సామగ్రినే ఎత్తుకెళ్లారని ప్రచారం సాగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరి సామాను దొంగిలించారన్న దానిపై మంచు ఫ్యామిలీ ఇప్పటిదాకా స్పందించలేదు.