యురోపియన్ యునియన్ నుండి బ్రిటన్ విడిపోవాలంటూ ఆ దేశవాసులు తీర్పును చెప్పిన విషయం తెలిసిందే. బ్రెక్సిట్ (బ్రిటన్ ఎక్సిట్)గా పాపులర్ అయిన ఈ యావత్ రిఫరెండమ్ సంఘటనపై ఇప్పుడు మంచు విష్ణు ఒక జోక్ వేశాడు. అసలు ఈ ప్రక్రియకు నాంది వేసి పూర్తి చేసింది నేనే.. అంటూ నవ్వులు పూయించాడు.
''22వ తారీఖున లండన్ వచ్చాను. ఇప్పుడు యురోపియన్ యునియన్ నుండి బ్రిటన్ విడిపోయాక.. పౌండ్ పడిపోయాక.. ఇప్పుడు బయలుదేరుతున్నాను. మిషన్ పూర్తయ్యింది. ఇప్పుడు 007 (జేమ్స్ బాండ్) ఏం చేస్తాడో చూద్దాం'' అంటూ ట్వీటేశాడు మంచు విష్ణు. నిజానికి ఈ ఒక్క ట్వీటుతో మనోడు తెగ నవ్వించాడనుకోండి. మంచు ఫ్యామిలీ అంతా లండన్ వెకేషన్ లో ఉండగా.. ఇలా జరిగిందని చెబుతూనే.. బ్రిటన్ గూడఛారిగా 007 సినిమాలతో వీర ఫేమస్ అయిన జేమ్స్ బాండ్ ఏం చేస్తాడో అని అనడంలో ఒక మాష్టర్ స్ర్టోక్ కామెడీ కనిపించింది.
ఇకపోతే బ్రిటన్ అసలు యురోపియన్ యునియన్ నుండి విడిపోవడం వలన మన దేశానికి ఏమైనా నష్టం ఉందా అంటూ ఆల్రెడీ న్యూస్ ఛానళ్ళ నుండి ఫేస్ బుక్ పోస్టుల వరకు అందరూ ఇష్టాగోష్టులు షురూ చేశారు. చూద్దాం ఏమంటారో!!