మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్ష పదవి రేసులో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఎపిసోడ్స్ అంతకంతకు వేడెక్కుతున్నాయా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. తాజాగా ప్రముఖ తెలుగు మీడియా చానెల్ ఇంటర్వ్యూలో మంచు విష్ణు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పైనా ఇండస్ట్రీలో కొందరిపైనా పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు.
మూవీ ఆర్టిస్టుల మధ్య యునిటీ లేదని... అసలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనేవారే లేరని ఆయన వ్యాఖ్యానించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. అలాగే గతంలో జైలు కెళ్లాల్సిన వాళ్లను కాపాడామని .. జైలుకెళ్లాల్సిన వాళ్లు శ్రుతిమించి మాట్లాడుతున్నారు! అంటూ పరోక్షంగా మంచు విష్ణు విసిరిన పంచ్ లు దావానలంలా టాలీవుడ్ ని చుట్టేస్తున్నాయి. ఇండస్ట్రీలో కొందరు ఊచలు లెక్క బెట్టకుండా బయట ఉన్నారంటే ఎవరి వల్ల అన్నది వాళ్లనే అడగాలి. పోలీస్ స్టేషన్ లో తెల్లవారి 4 గం.లకు కూచోబెడితే `అదొక మిస్ అండర్ స్టాండింగ్` అంటూ బయటకి తీసుకొచ్చాం. వారి పేర్లను మాత్రం చెప్పను అని మంచు విష్ణు టాప్ సీక్రెట్ ని రివీల్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
అలాగే మూవీ ఆర్టిస్టుల సంఘం భవంతి నిర్మాణం అనేది అసలు సమస్యే కాదని అది తమ ఎన్నికల ప్రధాన ఎజెండా కానే కాదని మంచు విష్ణు అన్నారు. అంతకుమించి పరిశ్రమలో ఆర్టిస్టుల్లో ఎన్నో సమస్యలున్నాయని వాటిని పరిష్కరించాలని విష్ణు సూచించారు. కరోనా కష్టాలు ప్రొడక్షన్ కష్టాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. కరోనా కష్టకాలంలో టాంటాం వేసుకునే వాళ్ల కంటే ఎందరో సహాయం చేసిన వాళ్లు పరిశ్రమలో ఉన్నారని తనదైన శైలిలో పరోక్ష విమర్శలు చేశారు. మంచి పని చేసినప్పుడు ప్రచారం చేస్తే స్ఫూర్తి నిచ్చిన వాళ్లు అవుతారని కానీ చాలామంది సెల్ఫ్ గా ప్రచారం చేసుకుంటున్నారని విష్ణు వ్యాఖ్యానించారు.
ఓవరాల్ గా మా అధ్యక్ష పదవికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో మరోమారు ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా విష్ణు ప్రకాష్ రాజ్ పై పరోక్షంగా విమర్శలు చేసారు. నేను ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే ఎటాక్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు పోటీ చేయాలని కోరడం వల్లనే పోటీ చేస్తున్నా.
ఫ్యామిలీలో జరిగే విషయాలు నేను బయట పెట్టను.. పెద్దలు చెప్పినది వింటాను. అదే ఆచరిస్తానని విష్ణు అన్నారు. రామారావు - ఏఎన్నార్ -దాసరి వంటి పెద్దలు చెప్పినవి విన్నారు. వినాలి. అలానే సినీపెద్దలు చెప్పేది అంతా వినాలి. నేను వింటున్నాను అని అన్నారు. మా ఎన్నికల గురించి టి-టౌన్ మాట్లాడడం ఆపేయాలి. ఏదో భీభత్సం ఏదో జరిగిపోతోందని అనుకుంటున్నారు. అదంతా మానేయాలి అని అన్నారు.
ఆర్టిస్టుల సంఘం అధ్యక్షులు తెలుగు వాళ్లే అవ్వాలనేం లేదు. మెంబర్లు కాని వాళ్లు పోటీ చేయకూడదు. అలాగే మెంబర్లు కాని వాళ్లకు పరిశ్రమలో అవకాశాలు ఇస్తున్నా ఆలోచించాలని అన్నారు.
విష్ణు ఇంటర్వ్యూ ఆద్యంతం బయట పెట్టను అంటూనే ఎన్నో రహస్యాల్ని బయటపెట్టారు. ముఖ్యంగా జైలు కెళ్లాల్సిన వాళ్లు ఎవరెవరు? అన్నది అతడు పేర్లు చెప్పాల్సి ఉందింకా. ఇకపోతే తెల్లవారు ఝామున 4గంటలకు ఎవరిని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించారు? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అలాగే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు! అన్న వ్యాఖ్య ఇప్పుడు మరో పెను సంచలనంగా మారింది.ఇంతకీ మంచు విష్ణు సూటిగా టార్గెట్ చేసింది ఎవరెవరిని అన్నది ఎవరికి వారు ఊహించుకుంటున్నారు.