50 కోట్ల పెట్టుబ‌డితో ఇల్లు క‌ట్టే ప్లాన్ లో ఉన్న హీరో

Update: 2021-03-15 04:30 GMT
మంచు విష్ణు న‌టించిన తాజా చిత్రం మోస‌గాళ్లు. కాజ‌ల్ కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమాని పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ చేసేందుకు విష్ణు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇంత‌కుముందే ఇందులో తాను విలన్ గా న‌టిస్తున్నాన‌ని.. కాజల్ తనకు అక్కగా నటిస్తోందంటూ అసలు గుట్టు విప్పేశాడు. అలా సినిమాకు సంబంధించిన విషయాలన్ని ముందే లీకులివ్వ‌డంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. సుమారు 50 కోట్ల బడ్జెట్ ని ఈ మూవీ కోసం వెచ్చిస్తున్నామ‌ని విష్ణు తెలిపారు.

ఇక విష్ణు కోసం స్నేహితుడు న‌వదీప్ ప్ర‌చారం ప‌రంగా బోలెడంత సాయం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు పది నిమిషాలు స్నీక్ పీక్ తో ఆక‌ట్టుకున్నారు. జెఫ్రీ  జీ చిన్ అనే ప్ర‌ఖ్యాత హాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో అంత‌ర్జాతీయంగానూ ఆస‌క్తి నెల‌కొంది. ఐటీ కుంభ‌కోణం స్కామ్ ల నేప‌థ్యంతో యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తెచ్చేందుకు విష్ణు స‌ద‌రు ద‌ర్శ‌కుడిని హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌ను బ‌రిలో దించారు.

ఇక‌పోతే ఈ మూవీ విజ‌యం పై విష్ణు చాలా ధీమాగా ఉన్నారు. త‌న అల‌వాట్లు పాత‌కాలం అల‌వాట్ల‌ని పాత కాలం మ‌నిషిన‌ని చెప్పిన విష్ణు.. త‌న‌తో ఉంటే ఎవ‌రైనా బోర్ ఫీల‌వుతార‌ని అన‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతేకాదు.. కుటుంబ స‌భ్యులంతా ఓ చోట క‌లిసి ఉండ‌టం అంటేనే త‌న‌కు ఇష్ట‌మ‌ని దానికోసం సొంతంగా హైద‌రాబాద్ లోనే ఓ ఇల్లు క‌డుతున్నాన‌ని కూడా తాజాగా వెల్ల‌డించారు. ఇక  మోస‌గాళ్లు విజ‌యంపై ధీమా ఉంది. ఈ సినిమాకి బ‌జ్ ఉంది. దాని లాభాల‌తోనే హైద‌రాబాద్ లో ఇల్లు క‌ట్టేస్తాన‌ని ధీమాను వ్య‌క్తం చేశారు. ఆ ఇంట్లోనే తన ఫ్యామిలీతో పాటు అమ్మా నాన్న అంతా క‌లిసి ఉంటామ‌న్నారు. అత్యంత భారీగా నిర్మించే ఈ ఇంటికోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చిస్తామ‌ని కూడా వెల్ల‌డించారు. అత‌డు చెప్పిన దానిని బ‌ట్టి సుమారు 50కోట్లు వెచ్చిస్తార‌ని కూడా అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News