మంచు విష్ణు.. ‘ఓటర్’ అయ్యాడు

Update: 2017-03-20 04:19 GMT
నిన్ననే మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచారి అమెరికా యాత్ర’ పేరుతో ఓ కొత్త సినిమా మొదలుపెట్టాడు మంచు విష్ణు. ఆ టైటిల్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అదే రోజు విష్ణు నటిస్తున్న మరో సినిమా టైటిల్ బయటికి వచ్చింది. ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో విష్ణు చేస్తున్న కొత్త సినిమాకు ‘ఓటర్’ అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గురించి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వెల్లడించడం విశేషం.

విద్యా నికేతన్ లో మోహన్ బాబు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇళయరాజా.. విష్ణు ‘ఓటర్’గా పలకరించబోతున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ఓటర్’ అనేది క్యాచీ టైటిల్. జనాలకు ఈజీగా రీచ్ అయ్యేందుకు అవకాశమున్న టైటిల్. ఈ టైటిల్ పెట్టారంటే ఇది రాజకీయాలతో ముడిపడ్డ సినిమాయేమో చూడాలి.

జాన్ సుధీర్ పూదోట ‘రామా రీల్స్’ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇది తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా. బీరువా.. ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ హీరోయిన్ సురభి ఇందులో కథానాయికగా నటిస్తోంది. తొలిసారిగా తమన్ మంచు విష్ణుకు సంగీతాన్నందిస్తున్న సినిమా ఇదే. ఈ ఏడాది ద్వితీయార్దంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News