ఇండియాలో దొంగల భయం ఎక్కువ. రద్దీ వేళ్లలో బిజీగా ఉండే సెంటర్లలో తిరుగుతుంటే ఎవరు జేబు ఖాళీ చేస్తారో తెలియదు. సెలబ్రిటీలు - వాళ్ల పిల్లలకు ఈ ఇబ్బంది తక్కువే. బేసిగ్గా వాళ్లు పబ్లిక్ ప్లేసుల్లో తిరిగేది తక్కువ కావడం.. దానికితోడు తగిన సెక్యూరిటీ ఉండటంతో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యేది తక్కువే. అయితే గియితే ఇలాంటి అనుభవాలు ఫారిన్ లోనే ఎదురుపడతాయి.
రీసెంట్ గా ఇలాంటి అనుభవం మణిరత్నం - సుహాసిని దంపతుల కుమారుడు నందన్ కు ఎదురైంది. వెనిస్ పర్యటనకు వెళ్లిన అతడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దొంగలు ఖాళీ చేశారు. ఎంత పోయిందో తెలియదు కానీ జేబులో నయాపైసా లేని పరిస్థితిలో పడిపోయాడట. వెనిస్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు అతడికి సాయం కావాలంటూ సుహాసిని ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ పోస్టు పెట్టిన క్షణాల్లోని వెనిస్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో ఉన్నవారు రెస్పాండయ్యారు. అతడు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో సుహాసిని వెంటనే మరో పోస్టు పెట్టారు. ‘అతడికి సహాయం అందుతోంది. ట్విట్టర్ ద్వారా హెల్ప్ చేయడానికి ముందుకొచ్చిన వారికి ధన్యవాదాలు’ అంటూ ధ్యాంక్స్ తెలిపారు.
మనకు బాగా కావలసిన వాళ్లు కష్టంలో ఇరుక్కున్నారంటే కచ్చితంగా తల్లడిల్లిపోతాం. అందులో కన్న కొడుకు కష్టంలో ఉన్నాడంటే తల్లి మనసు ఉండబట్టలేదు. ఎంత సెలబ్రిటీ అయినా సుహాసిని ఓ తల్లే కదా. అందుకే కొడుకు క్షేమం గురించి అంతగా ఆరాటపడింది.