2 కోట్ల బ‌డ్జెట్ లో క‌మ‌ల్ తో మ‌ణిర‌త్నం ప్లాన్!

Update: 2022-09-07 05:36 GMT
మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియ‌న్ సెల్వ‌న్ (పీఎస్-1) ఈ నెలాఖ‌రున‌ విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్ - ఆడియోను సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్- విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స‌మ‌క్షంలో ఘ‌నంగా ఆవిష్క‌రించింది చిత్ర‌బృందం. ట్రైల‌ర్ ఇప్ప‌టికే వెబ్ లో దూసుకెళుతోంది. చ‌రిత్ర నేప‌థ్యంలో రాజులు రాజ్యాధికారం నేప‌థ్యంలో ఈ మూవీ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది. భారీత‌నం నిండిన విజువ‌ల్స్ తో మ‌ణిరత్నం మ‌రో అసాధార‌ణ ప్ర‌య‌త్నం చేశారు.

ఈ చిత్రంలో జ‌యం ర‌వి- విక్ర‌మ్- కార్తీ- త్రిష‌- ఐశ్వ‌ర్యారాయ్ లాంటి భారీ తారాగ‌ణం న‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. నిజానికి ఈ సినిమాని తెర‌కెక్కించేందుకు మూడు ద‌ఫాలు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యార‌న్న‌ది చాలా త‌క్కువ‌మందికే తెలుసు. ఇది మ‌ణి ర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్.

తమిళ దివంగ‌త ర‌చ‌యిత కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా తెర‌కెక్కింది. మూడు ద‌శాబ్ధాల క్రిత‌మే ఈ న‌వ‌ల‌ను సినిమాగా తీయాల‌ని మ‌ణిరత్నం క‌ల‌లుగ‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

వేర్వేరు కాలాల్లో వేర్వేరు స్టార్ హీరోల‌ను సంప్ర‌దించినా కానీ సాధ్య‌ప‌డ‌లేదు. అప్ప‌ట్లో రామ్ చ‌ర‌ణ్ ని కూడా మ‌ణిర‌త్నం సంప్ర‌దించ‌గా అది ఎందుక‌నో వీలుప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం లైకా సంస్థ మ‌ద్ధ‌తుతో మ‌ణిర‌త్నం ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గ‌లిగారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. 1989లోనే చర్చ ప్రారంభిస్తే ఇప్ప‌టికి పూర్త‌యి రిలీజ్ కి రెడీ అవుతోంది.

అయితే మొద‌టిసారి ప్ర‌య‌త్నంలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా చేయాల‌ని మ‌ణిరత్నం భావించార‌ని విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. కల్కి కృష్ణమూర్తి 'కల్కి' మ్యాగజైన్ చిట్ చాట్ లో అస‌లు సంగ‌తిని రివీల్ చేసారు. ప్ర‌భు స‌త్య‌రాజ్ త‌న‌తో క‌లిసి న‌టించేందుకు అంగీక‌రించారు. పీసీ శ్రీ‌రామ్ - ఇళ‌య‌రాజా వంటి టాప్ టెక్నీషియ‌న్ల‌ను కూడా సంప్ర‌దించారు మ‌ణిరత్నం. కానీ ఆ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. త‌ర్వాత చాలామంది స్టార్ల‌ను మ‌ణిరత్నం సంప్ర‌దించారు.

అలాగే అప్ప‌ట్లో క‌మ్ హాస‌న్ తో ఈ చిత్రానికి రూ.2 కోట్ల వ‌ర‌కూ బ‌డ్జెట్ పెట్టాల‌ని కూడా భావించార‌ట. కానీ ఇప్పుడు ఏకంగా 350-400 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్ తో పొన్నియ‌న్ సెల్వ‌న్ ని మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాని 2డి- 3డి ఫార్మాట్ లో విడుద‌ల చేస్తార‌ని కూడా టాక్ ఉంది. సెప్టెంబ‌ర్ 30న పీఎస్ 1 తెలుగు-త‌మిళం-హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో అత్యంత భారీగా విడుద‌ల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News