'ఉయ్యాల జంపాల' బ్యూటీ ఎఫైర్ క‌హానీ

Update: 2019-09-04 17:30 GMT
`ఉయ్యాల జంపాల` సినిమాతో తొలి ప్ర‌య‌త్న‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది అవికా గోర్. హిందీ సీరియ‌ళ్ల అనువాదాల‌తో  తెలుగు లోగిళ్ల‌కు ప‌రిచ‌య‌మైన‌ ఈ అమ్మ‌డి క్రేజు ఆ సినిమాకి క‌లిసొచ్చింది. ఆ క్ర‌మంలోనే అవిక కెరీర్ గొప్ప‌గా వెలిగిపోతుంద‌నే భావించారు. అందానికి అందం .. చ‌బ్బీ లుక్స్ తో ఆక‌ట్టుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత కొన్ని వివాదాల్లోనూ చిక్కుకొంది. టాలీవుడ్ లో త‌న కెరీర్ ని ఎద‌గ‌నీకుండా కొంద‌రు కుట్ర చేశార‌ని అవికా గోర్ అన‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. అదంతా అటుంచితే.. ఈ అమ్మ‌డిపై బాలీవుడ్ లో మ‌రో ర‌కం ప్ర‌చారం ఉంది.

అక్క‌డ బుల్లితెర కో యాంక‌ర్ మ‌నీష్ రాయ్ సింగ‌న్ తో అవిక ఎఫైర్ సాగిస్తోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎఫైర్ విష‌య‌మై చాలాకాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ససురాల్ సిమర్ కా షో చేసేప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో నడుస్తోంద‌న్న పుకార్లు వినిపించాయి. త‌న‌కంటే ఎంతో పెద్ద‌వాడైన మ‌నీష్ తో అవిక‌ డేటింగ్ చేస్తోంద‌ని ప్ర‌చారం సాగింది.

తాజాగా మ‌రోసారి ఈ ఎఫైర్ గురించి వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లో ఓ సినిమా కోసం ఈ జోడీ మ‌రోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నార‌ట‌. పైగా ఓ రొమాంటిక్ కామెడీ చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి వేడెక్కించే ప్ర‌చారం సాగుతోంది. అయితే ప‌బ్లిక్ వేదిక‌ల‌పై ఆ ఇద్ద‌రూ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ రూమ‌ర్ల‌ను ఖండిస్తూనే ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్యా 19 ఏళ్ల గ్యాప్ ఉంద‌ని.. మేం కేవ‌లం స్నేహితులం మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. అప్పుడు స్నేహితులుగా ఉన్నాం... ఇప్పుడు కూడా స్నేహితులుగానే ఉంటామ‌ని చెబుతున్నారు.

మ‌నీష్ ని ప్ర‌శ్నిస్తే.. ఇదే మాట చెబుతున్నాడు. ఆ ప్ర‌చారం వ‌ల్ల‌ మా ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఆరంభం ఈ రూమ‌ర్ల వ‌ల్ల‌.. చాలామంది దూర‌పు బంధువులు నా గురించి ఎంక్వ‌యిరీలు చేసేవారు. దానికి చాలా సిగ్గుగా అనిపించేది. అవిక చాలా చిన్న పిల్ల‌. మా చుట్లాలంతా తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డ‌మేటో.. ఈ విష‌యంలో నాకు త‌ల్లిదండ్రులు చాలా స‌పోర్టివ్ గా నిలిచారు. మా మ‌ధ్య ప‌రిణ‌తి చెందిన స్నేహం ఉంద‌ని అమ్మా నాన్న గ్ర‌హించారు.. అని తెలిపారు. అప్పుడు ఎండ్ చేసిన స్నేహం మ‌ళ్లీ ఇప్పుడు కొన‌సాగిస్తున్నామ‌ని అన్నారు. ఇద్ద‌రి మ‌ధ్యా అప్పుడూ ఏం లేదు.. ఇప్పుడూ ఏం లేదు. ఇద్ద‌రం ఒక‌రికొక‌రం గౌర‌వించుకుంటాం. లైఫ్ పార్ట‌న‌ర్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాన‌ని మ‌నీష్ అన్నారు.

అవిక గోర్ ను ఇదే విష‌యం అడిగితే.. ఈ స్పెక్యులేష‌న్స్ ఇప్ప‌ట్లో ఆగిపోయేవి కావు. సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నామ‌ని.. కిడ్స్ ఉన్నార‌ని .. పిల్ల‌ల్ని ఎక్క‌డో దాచి పెట్టామ‌ని చాలా కామెంట్లు వినిపించాయి. అప్ప‌ట్లో. ఇద్ద‌రం ఆ రూమ‌ర్ల‌ను పట్టించుకోవ‌ద్ద‌ని అనుకున్నాం. మ‌నీష్ తోనే కాదు ఎవ‌రితోనూ డేటింగ్ చేయ‌డం లేదు అని అవికా గోర్ చెప్పింది.


Tags:    

Similar News