సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈమధ్యే తన కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. పూరి-రామ్ కాంబినేషన్ లో తెరకెక్కే మొదటి సినిమా ఇది. ఫస్ట్ లుక్ పోస్టర్ .. టైటిల్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమా ప్రకటించిన రెండురోజుల్లోపే పూరి క్యాంప్ నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు మణిశర్మ ను సంగీత దర్శకుడిగా ఫైనలైజ్ చేశారట. పూరి - మణిశర్మ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపుగా చార్ట్ బస్టర్ ఆల్బమ్సే. పూరి - మణిశర్మ కాంబో లో వచ్చిన 'పోకిరి' ఆల్బమ్ ను ది బెస్ట్ అని చెప్పవచ్చు. పూరి లాస్ట్ హిట్ 'టెంపర్' కు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అయినా నేపథ్య సంగీతం అందించింది మాత్రం మణిశర్మ.
పూరి తన కెరీర్ లో హిట్లు లేక సతమతమౌతున్నాడు. అదే సమయంలో మణిశర్మ కూడా పెద్ద స్టార్ల సినిమా అవకాశాలు దాదాపుగా తగ్గిపోయాయి. ఈ సమయంలో పూరి - మణిశర్మ కాంబినేషన్ ఖచ్చితంగా డూ ఆర్ డై సిట్యుయేషన్ లాంటిదే. మరి మణిశర్మ ఈ చిత్రానికి ఎలాంటి సంగీతం అందిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమాను పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ పైన నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన నటించే హీరోయిన్.. ఇతర నటీనటులు.. తెక్నిషియన్ల వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Full View