వ్యాక్సినేష‌న్ విక‌టించి వివేక్ చ‌నిపోయాడంటూ స‌హ‌న‌టుడి గ‌డ‌బిడ‌

Update: 2021-04-17 06:10 GMT
ప్రముఖ త‌మిళ హాస్య‌న‌టుడు వివేక్ ఆక‌స్మిక మ‌ర‌ణం అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. ప్ర‌స్తుతం ఈ మ‌ర‌ణం సోష‌ల్ మీడియాలో కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయ‌నకు గుండె ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన డాక్ట‌ర్లు స్టెంట్లు వేశామ‌ని అయితే అంత‌కుముందు ఆయ‌న తీసుకున్న క‌రోనా వ్యాక్సినేష‌న్ కి ఈ మ‌ర‌ణానికి ఎలాంటి సంబంధం లేద‌ని వివ‌ర‌ణ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర డిబేట్ కి తెర తీసింది.

వివేక్ ను వడపాలనిలోని సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ గుండె క్లిష్టమైన రక్తనాళంలో పూర్తిగా బ్లాక్ అవ్వ‌డంతో యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ప్రక్రియ చేయించుకున్నారు. అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ECMO సపోర్ట్ లో ఉంచారు. కానీ  కరోనరీ సిండ్రోమ్ కారణంగా ఆకస్మిక దాడి తీవ్ర‌త‌ర‌మై తెల్లవారుజామున 4.35 గంటలకు కన్నుమూశాడు అని ఆసుపత్రికి చెందిన మెడికల్ బులెటిన్ తెలిపింది.

అయితే ఈ మ‌ర‌ణానికి కార‌ణం క‌రోనా వ్యాక్సినేష‌న్ అని..  గుండె నొప్పి న్న‌వారికి ఈ వ్యాక్సినేష‌న్ వేయ‌కూడ‌ద‌ని న‌టుడు కం రాజ‌కీయ నాయ‌కుడు సోష‌ల్ యాక్టివిస్ట్ మ‌న్సూర్ అలీఖాన్ వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది. నిజానికి క‌రోనాకు వ్యాక్సినేష‌న్ అంటూ డాక్ట‌ర్లతో పాటు ప్ర‌భుత్వాలు మీడియాలు హ‌డావుడి చేసేస్తున్నాయ‌ని అస‌లు ఈ వైర‌స్ లు రోగాలు చాలా కాలంగా ఉన్న‌వేన‌న్న‌ది అత‌డి వాద‌న‌. తాను వ్యాక్సినేష‌న్ కి పూర్తి వ్య‌తిరేకిన‌ని ఆయ‌న అంటున్నారు.

అంతేకాదు.. క‌రోనా పేరుతో ప్ర‌జ‌ల్ని అన‌వ‌స‌రంగా భ‌య‌పెట్టేస్తున్నార‌ని.. వ్యాక్సినేష‌న్ అంటూ ప్ర‌జ‌ల జేబు గుల్ల చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ఇప్పుడు వివేక్ కి వ్యాక్సినేష‌న్ వేశాక గుండె ఆప‌రేష‌న్ చేయ‌డంపైనా ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఇది జాతీయ స్థాయిలో డిబేట్ గా మార‌నుంది. అయితే డాక్ట‌ర్లు వ్యాక్సినేష‌న్ కి  గుండె ఆప‌రేషన్ కి ఎలాంటి సంబంధం లేద‌ని ఆప‌రేష‌న్ తో ముప్పు త‌లెత్త‌లేద‌ని వాదిస్తున్నారు. ప్ర‌స్తుతం మన్సూర్ అలీఖాన్ వ్య‌తిరేక ఆరోప‌ణ‌లు సోష‌ల్ మీడియాల్లోనూ తీవ్ర‌మైన‌ డిబేట్ కి తెర తీస్తున్నాయి. మ‌న్సూర్ అలీఖాన్ తమిళం-మ‌ల‌యాళం- తెలుగు భాష‌ల్లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో విల‌న్ గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించారు. కెప్టెన్ ప్ర‌భాక‌ర్ అనే చిత్రంలోనూ అత‌డు తీవ్ర‌వాది పాత్ర‌లో న‌టించారు. ర‌జ‌నీకాంత్.. విజ‌య్ స‌హా అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల్లో మ‌న్సూర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.Full View
Tags:    

Similar News