‘జనతా గ్యారేజ్’.. ‘మనమంతా’ లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపే సంపాదించాడు మోహన్ లాల్. దీంతో మలయాళంలో ఆయన నటించిన సినిమాల్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ కోవలో వచ్చిన తొలి సినిమా ‘మన్యం పులి’. గత ఏడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం మంచి వసూళ్లే సాధించింది. నిర్మాతకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఐతే ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ తెలుగులో రిలీజ్ చేయనున్నారట. మే 6న ‘మన్యం పులి’ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ చిత్రాన్ని ఇంతకుముందు తెలుగులో అందించిన సరస్వతి ఫిలిమ్స్ అధినేత ‘సింధూరపువ్వు’ కృష్ణా రెడ్డి వెల్లడించడం విశేషం.
ఇంతకుముందు రిలీజ్ చేసినపుడు మంచి వసూళ్లే వచ్చినప్పటికీ.. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల కలెక్షన్లకు కోత పడిందని.. చాలామంది సినిమా చూడలేకపోయామని బాధపడ్డారని.. ఎగ్జిబిటర్లు ఈ సినిమాను మళ్లీ ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారని.. అందుకే మే 6న మళ్లీ ‘మన్యం పులి’ని రిలీజ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఐతే ‘బాముబలి: ది బిగినింగ్’ లాంటి సినిమాను రీ రిలీజ్ చేస్తేనే జనాలు చూడలేదు. తెలుగులో పెద్ద సినిమాలకే సీన్ లేనపుడు ఓ మలయాళ డబ్బింగ్ సినిమాను రీ రిలీజ్ చేస్తే జనాలు ఎంతమాత్రం పట్టించుకుంటారన్నది సందేహం. ఇదే బేనర్ నుంచి ఈ నెలలో ‘ఏంజెల్’ అనే సినిమా వస్తోంది. కృష్ణారెడ్డి తనయుడైన నాగ అన్వేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. హెబ్బా పటేల్ కథానాయిక.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/