సస్పెన్స్‌ కు తెర దించేసిన మారుతి

Update: 2018-08-28 13:03 GMT
నాగచైతన్య - అను ఎమాన్యూల్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదల తేదీ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌ కు దర్శకుడు మారుతి తెరదించేశాడు. ఆగస్టు 31న విడుదల కావాల్సిన ఈ చిత్రం రీ రికార్డింగ్‌ ఆలస్యం అయిన కారణంగా వాయిదా వేయడం జరిగింది. వాయిదా గురించి సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సమయంలో నాగచైతన్య సినిమాను అనుకున్న సమయంకు తీసుకు రాలేక పోతున్నట్లుగా ట్వీట్‌ చేశాడు. అప్పటి నుండి ఈచిత్రం విడుదల తేదీ విషయంలో పలు రకాల ఊహాగాణాలు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా దర్శకుడు మారుతి అన్ని ఊహాగాణాలకు తెర దించుతూ ఈ చిత్రాన్ని వినాయక చవితి శుభాకాంక్షలతో సెప్టెంబర్‌ 13న విడుదల చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. రేపు నాగార్జున బర్త్‌ డే స్పెషల్‌ గా చిత్రం ట్రైలర్‌ ను కూడా ఉదయాన్నే అక్కినేని అభిమానుల కోసం విడుదల చేయబోతున్నాం అంటూ మారుతి ట్వీట్‌ చేశాడు. శైలజ రెడ్డి అల్లుడు విడుదల విషయంలో ఇంత చర్చకు కారణం యూటర్న్‌. సెప్టెంబర్‌ 13న యూటర్న్‌ విడుదల కాబోతుంది. ఆ కారణంగా ఈ చిత్రం మరో తేదీలో వస్తుందా అనే చర్చ జరిగింది.

సెప్టెంబర్‌ 13 కాకుండా మరో తేదీకి వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు - చాలా రోజుల పాటు చిత్రం విడుదల కోసం ఎదురు చూడాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో మారుతి తప్పనిసరి పరిస్థితుల్లో ‘యూటర్న్‌’ చిత్రానికి పోటీగా ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు. సమంత - నాగచైతన్యల పెళ్లి తర్వాత కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకున్నారు. కాని ఇలా ఒకే రెండు వారి రెండు చిత్రాలను విడుదల చేస్తారని ఊహించలేదు అంటూ అక్కినేని అభిమానులు అంటున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా విజయాన్ని దక్కించుకోవాలని అక్కినేని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.
Tags:    

Similar News