ప్రతి ఒక్క దర్శకుడికి కొన్ని కలలు ఉంటాయి. ఫలానా బ్రాండ్ సినిమా తీయాలి. ఫలానా దర్శకుడి రేంజుకు ఎదగాలి.. ఇలా స్ఫూర్తి ఉంటుంది. అలా మారుతికి ఏమైనా ఉందా? అంటే ఎందుకు లేదు అని ఎదురు ప్రశ్నించాడు. ప్రతి దర్శకుడు విలక్షణమైన సినిమాల్ని తీయాలి. ఫలానా తరహా సినిమాలకే ఈయన సూటబుల్ అంటే కెరీర్ అక్కడితో సమాప్తం. అందుకే నవ్య పంథా కథలు ఎంచుకుని ప్రయోగాలు చేయడం అంటే ఇష్టమని మారుతి తెలిపాడు.
ప్రతిసారీ కొత్త రకమైన కథలతో సినిమాలు తీయాలనేది నా మైండ్ సెట్. మారుతి ఇలాంటివే తీస్తాడనే ఓ ముద్ర నాపై పడకూడదని భావిస్తాను. ప్రేమకథా చిత్రమ్ హిందీ వెర్షన్ చేయకపోవడానికి కారణమదే. ప్రస్తుతం మైమరుపు మీద సినిమా తీశాను. కానీ నాకు డిజార్డర్ జోనర్ సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి ఓ సినిమా చేయాలి. అయితే అందుకు ఇంకాస్త విరామం తీసుకున్నాకే చేస్తాను. 1980 నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ నేపథ్యంలో కథలని ఎంచుకుని సినిమాలు చేస్తాను అని తెలిపాడు.
తదుపరి ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే.. యు.వి.క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ కలయికలో ఒక చిత్రాన్ని చేసేందుకు సంతకం చేశానని తెలిపారు. మహేష్ బాబు సోదరి మంజుల నిర్మాతగా ఒక సినిమా చేయాల్సివుంది. విజయ్ దేవరకొండతోనూ ఒక చిత్రం చేస్తాను. ప్రస్తుతం నిర్మాతగా కొత్తవాళ్లతో చిన్న చిత్రాలు చేయడం నిలిపేశాను... అని తన భవిష్యత్ ప్రణాళికల్ని మారుతి వివరించారు.