చిన్న చిత్రాల దర్శకుడిగా - బూతు చిత్రాల దర్శకుడిగా కెరీర్ ఆరంభంలో గుర్తింపు దక్కించుకున్న మారుతి, ఆ ఇమేజ్ నుండి వెంటనే బయట పడ్డాడు. ‘కొత్త జంట’ - ‘భలే భలే మగాడివోయ్’ - ‘బాబు బంగారం’ - ‘మహానుబావుడు’ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన మారుతి తాజాగా ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు మారుతి ఏబీఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ‘బాబు బంగారం’ చిత్రం సమయంలో తనకు నయన్ కు మద్య జరిగిన గొడవ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు.
‘బాబు బంగారం’ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఆమె వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా మారుతి చెప్పుకొచ్చాడు. మేము చిన్నవాళ్లం - మాకు గౌరవం ఇవ్వు - ఇవ్వకపో అది వేరే విషయం. కాని వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే అంటూ తాను పదే పదే నయనతారతో చెప్పడం జరిగింది. కాని ఆమె మాత్రం ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం - వెంకటేష్ గారి ముందు గౌరవం లేకుండా వ్యవహరించడం చేసింది. దాంతో ఆమెతో నేను గొడవ పడాల్సి వచ్చిందని మారుతి చెప్పుకొచ్చాడు.
కెరీర్ ఆరంభంలో చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డట్లుగా చెప్పిన మారుతి బతకడం కోసం తాను బండిపై అరటి పండ్లను కూడా అమ్మినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆర్య చిత్రంను వంశీ మరియు బన్నీతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. అది తన జీవితాన్ని మార్చేసింది అంటూ మారుతి పేర్కొన్నాడు. భారీ చిత్రాల పంపిణీ మరియు భారీ చిత్రాలను తెరకెక్కించే ఉద్దేశ్యం తనకు అస్సలు లేదు అంటూ చెప్పుకొచ్చాడు. చిన్న చిత్రాలతోనే మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తాను అంటూ మారుతి ఆర్కే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.