మారుతి.. ఇప్పుడు టాలీవుడ్ ఈ డైరెక్టర్ ఓ సంచలనం. పెట్టిన పెట్టుబడికి 4-5 రెట్లు కలెక్షన్లు రాబట్టే సినిమాలు తీసి సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యాడు. భలేభలే మగాడివోయ్ తో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కూడా కొట్టేశాడు. జాగ్వర్ కార్ ని గిఫ్ట్ గా అందుకున్నాడు. చిన్న చిత్రాలకు రాజమౌళి అనిపించుకున్నాడు. ఇన్ని ఉన్నా మారుతికి ఒకటి మాత్రం మిస్ అయింది. అదే బ్రాండ్.
అదేంటీ.. మారుతీ అంటే ఓ బ్రాండ్ ఉందిగా అనకండి. ఎందుకంటే ఆ బూతు బ్రాండ్ నుంచి బయటపడ్డానికి ఈయన బాగానే కష్టపడుతున్నాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ లతో అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. స్టార్ స్టేటస్ పొందడం కోసం రూట్ మార్చడంతో మారుతీ అంటే ఏ బ్రాండో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది ఇపుడు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లంటే.. వాళ్ల సినిమా ఇలా ఉంటుంది అని ఓ పర్ఫెక్ట్ విజన్ ఉంటుంది. పూరీ సినిమాల్లో హీరో అంటే.. భయం ఉండదు, కేర్ లెస్ గా నచ్చినది చేసేస్తూ ఉంటాడు. అదే త్రివిక్రమ్ మూవీలో అయితే.. మాటలే మాయ చేసే మంత్రాల మాదిరిగా ఉంటాయి. అందుకే ఆయన మాటల మాంత్రికుడు. ఇక వినాయక్ ను తీసుకుంటే.. సాధారణ మాస్ స్టోరీ ఇచ్చినా యాక్షన్ తో మైండ్ బ్లోయింగ్ అనిపించేస్తాడు.
మరి మారుతీ డైరెక్షన్ అంటే హీరో ఎలా ఉంటాడు? చెప్పలేం కదూ.. అదే ఇప్పుడు మారుతిని స్టార్ హీరోల దగ్గరకి చేర్చడంలో కీలకంగా మారుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా స్టార్ హీరోలు అక్కున చేర్చుకోనిది అందుకనే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మారుతీకి లేనిది, సాధించుకోవాల్సినది అదే. తన సినిమాలకు ఓ స్టైల్ - స్టేటస్ లను అర్జంటుగా కట్టబెట్టాలి. చేసేస్తాడు లెండి.. ఎందుకంటే ఈయనో స్క్రిప్ట్ ఫ్యాక్టరీ లాంటోడు. టాలీవుడ్ లో ఏ హీరో కోసమైనా తన దగ్గర రెడీగా రెడీమేడ్ స్క్రిప్ట్ ఉందని ఇప్పటికే చెప్పాడు కదా.