కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మెహ్రీన్ పీర్జాద. అమ్మడి అదృష్టం ఏమిటో గాని ఒక్క సినిమాతోనే వరుస ఛాన్సులను దక్కించుకుంది. స్టార్ హీరోయిన్స్ కి కూడా లేని బిజీ షెడ్యూల్ మెహ్రీన్ దక్కించుకుంది. దాదాపు అపజయాల్లో ఉన్న మీడియం హీరోలందరూ ఈ అమ్మడినే నమ్ముకున్నారు. ఏడాది నుంచి చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి.
అయితే అందులో మహానుభావుడు సినిమా ముందుగా రాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. సినిమాలోని "కిస్ మి బేబీ" అనే పాట యూరప్ లోని క్రొయేసియాలో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు.. మెహ్రిన్ ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిందట. అమె వీపుకి బాగా దెబ్బ తగిలింది అయితే అక్కడ దగ్గరలో హాస్పిటల్ కూడా లేకపోవడంతో చిత్ర యూనిట్ కి ఏం చెయ్యాలో అర్ధం కాలేదట. అలాగే సినిమా రిలీజ్ కి కూడా టైమ్ దగ్గర పడుతుండడంతో ఆలస్యం అయితే కష్టమని అనుకుంటున్నా సమయంలో మెహ్రిన్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకొని షాట్ కి రెడీ అయిపోయిందట.
దీంతో దర్శకుడు మారుతి ఆమె పనితనాన్ని చూసి ఆశ్చర్యపోయారని చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒకరు తెలిపారు. మహానుభావుడు సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతోంది.