అఆ’ హవా పూర్తిగా తగ్గిపోయింది. ‘జెంటిల్ మన్’ కూడా జోరు తగ్గించేశాడు. ‘బిచ్చగాడు’ ఓ మోస్తరుగా ఆడుతోంది. ఇక గత వారం విడుదలైన ‘ఒక మనసు’ తొలి రోజు నుంచే డివైడ్ టాక్ తో నడుస్తోంది. కలెక్షన్లు ఏమంత గొప్పగా లేవు. ఇక ‘కుందనపు బొమ్మ’ సంగతి చెప్పాల్సిన పనే లేదు. శర్వానంద్ సినిమా ‘రాజాధిరాజా’ విడుదలైన సంగతి కూడా జనాలు పెద్దగా తెలియదు. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ఒకరకమైన స్లంప్ నడుస్తోందిప్పుడు. ఇలాంటి టైంలో విడుదలవుతుండటం ‘రోజులు మారాయి’కి కలిసొచ్చే అంశం. తెలుగులో యూత్ ఫుల్ మూవీ వచ్చి చాలా కాలమవుతోంది. ఆ లోటును ఈ శుక్రవారం విడుదల కాబోయే ‘రోజులు మారాయి’ సినిమా తీరుస్తుందని అంచనా వేస్తున్నారు.
కొంత కాలంగా తన దర్శకత్వంలో చేస్తున్న సినిమాల మీదే దృష్టిపెడుతున్న మారుతి.. చాన్నాళ్ల తర్వాత కథ-స్క్రీన్ ప్లే అందించి స్వయంగా నిర్మించిన సినిమా ‘రోజులు మారాయి’. మారుతి బ్రాండ్ యూత్ ఫుల్ సినిమాల కోసం యువ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా కాలేజ్ యూత్ లో మారుతి సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాలేజీలు కూడా తెరుచుకున్న టైంలో ‘రోజులు మారాయి’ విడుదలవుతోంది. ప్రోమోస్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి కాబట్టి.. కంటెంట్ కూడా ట్రెండీగా ఉంది కాబట్టి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే.. సినిమా పెద్ద హిట్టయ్యేందుకు కూడా అవకాశముంది. మురళీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కావడం విశేషం. పార్వతీశం-చేతన్-తేజస్వి-కృతిక జయకుమార్ కీలక పాత్రలు పోషించారు.