పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు మారుతి విషయంలో కరుణించిన సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా? ఉండదా? అని చాలా కాలంగా ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో అన్నింటికి దాదాపు పుల్ స్టాప్ పడిపోయింది. ఈ ద్వయం ఏ క్షణమైనా సెట్స్ కు వెళ్లడానికి ఛాన్స్ ఉంది. మరి డార్లింగ్ తో మారుతి ఎలాంటి కథని తెరకెక్కిస్తాడు? అన్నది ఆసక్తికరం.
పాన్ ఇండియాస్టార్ తో మారుతి చేసే కథ ఎలా ఉంటుందంటూ ఒకటే ఉత్సాహం అభిమానుల్లో కలుగుతోంది. అయితే ఇది ప్రభాస్ రేంజ్ స్టోరీ కాకపోయినా మారుతి రేంజ్ మెప్పించే కథాంశంతోనే సినిమా చేస్తాడు? అన్నది అభిమానుల నమ్మకం. ఇప్పటికే రాజా డీలక్స్ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అయితే ఇది రాజా డీలక్స్ అనే ఓ థియేటర్ చుట్టూ తిరిగే తాత-మనవల కథగా తాజాగా వెలుగులో వస్తుంది.
ఇదే కథకి హారర్ కామెడీ టచ్ అప్ ఇచ్చి మారుతి శైలిలో తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది. పూర్వీకుల నుంచి వారతస్వంగా వస్తోన్న సందపదగా థియేటర్ నేపథ్యాన్ని బేస్ చేసుకుని మారుతి కథని అల్లినట్లు తెలుస్తోంది. మారుతికి టైటిల్ డిసైడ్ చేసుకున్న తర్వాత కథ రాయడం అలవాటు. ఆ ప్రక్రియలోన రాజా డీలక్స్ కథ కూడా సిద్దమైందని ..ఆ కోణంలో టైటిల్ ముందుగానే బయటకు లీక్ అయినట్లు గుస గుస వినిపిస్తుంది.
మరి ఇందులో వాస్తవం ఏంటో తెలియాలి. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఓభారీ థియేటర్ సెట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ సెట్ కోసమే 6 కోట్లు కేటాయించారుట. కథ అంతా థియేటర్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి పెద్దగా లోకేషన్ల పని ఉండదని తెలుస్తోంది. సినిమా మొత్తం రెండు షెడ్యూల్స్ లో పూర్తిచేస్తారుట. ప్రభాస్ సినిమా కోసం తక్కువగానే డేట్లు కేటాయించినట్లు సమాచారం.
మేజర్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి 50 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కేవలం రీజనల్ గానే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని పాన్ ఇండియాలో అయితే సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఇందులో డార్లింగ్ కి జోడీగా మాళవిక మోహనన్ ని ఎంపిక చేసారుట.
యూవీ క్రియేషన్స్-పీపూల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సలార్..ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటి తర్వాత పూర్తిగా సందీప్ వంగ స్పిరిట్ చిత్రానికి సమయం కేటాయిస్తారు. ఈ మద్యలోనే డార్లింగ్ డీలక్స్ రాజా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.