సింగం సూర్య - కేజీఎఫ్ య‌ష్ ల‌ను బుట్ట‌లో వేసిన‌ట్టేనా?

Update: 2021-07-13 16:30 GMT
బాల‌య్య‌కు సింహా- లెజెండ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందించిన బోయ‌పాటి ప్ర‌స్తుతం `అఖండ‌`తో హ్యాట్రిక్ విజ‌యం అందించ‌డ‌మే ధ్యేయంగా ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖండ బెస్ట్ ఔట్ పుట్ కోసం భారీ మాస్ యాక్ష‌న్ ని ఆయ‌న డిజైన్ చేశార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. వీటికోసం కొండ కోన‌లు అడ‌వుల్లో బాల‌య్య లాంటి సీనియ‌ర్ హీరోని తిప్పారు.

న‌ట‌సింహా అఖండ పూర్త‌యిన‌ త‌రవాత  సింగం సూర్య‌తో బోయ‌పాటి ప‌ని చేస్తార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. సూర్య‌కు అదిరిపోయే మాస్ స్క్రిప్ట్ ని బోయ‌పాటి నేరేట్ చేశార‌ని ఇది సూర్య‌కు స్ట్రెయిట్ సినిమాగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారు.

సూర్య‌తో పాటు అటు కేజీఎఫ్ హీరో య‌ష్ కి కూడా బోయ‌పాటి ఓ స్క్రిప్ట్ ని నేరేట్ చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. య‌ష్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 చిత్రీక‌ర‌ణ ముగించి రిలీజ్ పై దృష్టి సారించారు. ఈ చిత్రం తెలుగు-క‌న్న‌డ‌-త‌మిళం-హిందీలో అత్యంత భారీగా రిలీజ్ కానుంది. ఒక‌వేళ య‌ష్ తో క‌థాచ‌ర్చ‌లు ఫ‌లిస్తే అత‌డికి తెలుగులో స్ట్రెయిట్ సినిమాగా ఇది రూపాంత‌రం చెందుతుంది. తెలుగు-క‌న్న‌డ ద్విభాష‌ల్లో ఈ మూవీని కీల‌కంగా రిలీజ్ చేస్తారు.

మహమ్మారి కాలంలో బోయపాటి ఈ రెండు స్క్రిప్టుల‌పైనా ప‌ని చేశార‌ని .. మంచి ఔట్ పుట్ తో సిద్ధంగా ఉన్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సూర్య .. య‌ష్ ఇద్ద‌రి సినిమాల‌ను దిల్ రాజు నిర్మిస్తారు. ప్రస్తుతానికి బోయపాటి శ్రీను సెప్టెంబర్ లో విడుదల కానున్న  అఖండపై దృష్టి సారించారు. ఈ మూవీ షూటింగ్ ముగింపులో ఉంది. త‌దుప‌రి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పైనా దృష్టి సారించ‌నున్నారు.
Tags:    

Similar News