మసాలా డైరెక్టర్ పైసా కూడా బైటకు తీయడే!

Update: 2020-03-30 09:10 GMT
ఆయనో మాస్ మసాలా యాక్షన్ డైరెక్టర్. అయితే ఆయన లాస్ట్ సినిమా ఫ్లాప్ దెబ్బకు ఆడియన్సుకే కాదు.. ఆయనకు కూడా దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. అతి కష్టం మీద.. ఎన్నో రోజులు వేచి చూసి ఓ సీనియర్ స్టార్ తో ఒక సినిమాను లైన్లో పెట్టాడు.  నిజానికి ఈయన హంగామాకు.. ఆయన రచ్చకు భలే లంకె కుదురుతుంది. అయితే ఆయన సినిమాలు కూడా ఈ మధ్య బండ ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. దీంతో ఈ సినిమా విజయం చాలా కీలకం.  ఆఖరికి నిర్మాత కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు.. ఈ సినిమా విజయం ఆయనకు కూడా ముఖ్యమే.

ఈ సినిమా హిట్ అవ్వకపోతే హీరోగారికి మరో సినిమా ఉంటుందేమో కానీ ఈ మాస్ డైరెక్టర్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడడం ఖాయం. అలా జరిగితే ఈ డైరెక్టర్ ఇంతకుముందు తన దగ్గర పనిచేసి ఇప్పుడు  స్టార్ డైరెక్టర్ గా మారిన మరో వ్యక్తి దగ్గర పని చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈయన చేతిలో మోసపోయిన శిష్యులు శాపాలు పెడుతున్నారట.  మరి ఈ మసాలా సినిమాల దర్శకుడు ఆ శిష్యులను ఏ విషయంలో వేధించాడో తెలియదు కానీ వారు మాత్రం గుర్రుగానే ఉన్నారని టాక్.

ఆ విషయం పక్కన పెడితే ఈ దర్శకుడు ఓ సినిమాకు 12 నుంచి 15 కోట్ల రూపాయల పారితోషికం పుచ్చుకుంటాడు.  కానీ ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఎంతోమంది హీరోలు ఇతర టెక్నిషియన్లు విరాళాలు ఇస్తూ తమ మంచి మనసు చాటుకుంటూ ఉంటే ఈ మనిషి మాత్రం ఇప్పటి వరకూ ఏమాత్రం స్పందించలేదు.  సినిమాల్లో సేవ.. త్యాగం.. బొంగు అంటూ లెక్చర్లు దంచుతారు కానీ నిజ జీవితంలో రూపాయ కూడా తీయరని ఇప్పటికే ఈయనపై సెటైర్లు పడుతున్నాయి.


Tags:    

Similar News