యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీని ఇటీవల ప్రకటించడం.. అది పట్టాలెక్కకుండానే మధ్యలో ఆగిపోవడం తెలిసిందే. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాల్లో అర్జున్ కు, హీరో విశ్వక్ సేన్ కు మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాలు చిలికి చిలికి పెను వివాదంగా మారాయి. దీంతో మీడియా ముందుకొచ్చిన సీనియర్ హీరో అర్జున్ విశ్వక్ సేన్ నిబద్ధత లేని నటుడని, అతన్ని తన సినిమా నుంచి తొలగించానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా విశ్వక్ సేన్ తో సినిమాలు చేసే నిర్మాతలు ఆలోచించుకోవాలని, ఈ విషయాన్ని నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు. అర్జున్ సంచలన ఆరోపణలపై హీరో విశ్వక్ సేన్ స్పందించాడు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు, చంద్రబోస్ పాటలు, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ విషయంలో నేను అన్నమాట నిజమే అన్నారు. అయితే కళ్లు మూసుకుని కాపురం చేయలేనని, ఆ కారణంగానే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు.
ఇక ఈ ఇద్దరి వివాదంపై సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కాస్త ఘాటుగా స్నందించారు. హీరో విశ్వక్ సేప్ పై ఓ రేంజ్ లో విరుజుకుపడ్డారు. తనదే తప్పని తేల్చేశారు. యంగ్ హీరోల అధిక జోక్యం కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు.
అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ తనకు ప్రతికూలంగా మారే అవకాశం వుందని హీరో విశ్వక్ సేన్ వర్రీ అవుతున్నాడట. ప్రస్తుతం ఇష్యూ నుంచి అందరి మైండ్ ని డైవర్ట్ చేయాలనే ఆలోచనలో వున్నాడట.
ఇందులో భాగంగానే తను నటిస్తూ తెరకెక్కిస్తున్న `దాస్ కీ ధమ్కీ` మూవీ టీజర్ ని రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. దీని కోసం పగలు, రాత్రి అని తేడా లేకుండా వర్క్ చేస్తున్నాడట. టీజర్‌ని రెడీ చేసిన విశ్వక్ సేన్ ఫైనల్ సౌండ్ డిజైనింగ్ వర్క్ ని మొదలు పెట్టాడట. ప్రస్తుతం తనకు, అర్జున్ కి మధ్య రగులుతున్న వివాదాన్ని ` `దాస్ కీ ధమ్కీ` మూవీ టీజర్ తో డైవర్ట్ చేయాలనుకుంటున్నాడట. టీజర్ కూడా చాలా బాగా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరి టీజర్ తో విశ్వక్ సేన్ అనుకున్నది నెరవేరి టాపిక్ డైవర్ట్ అవుతుందుమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.