మాస్ మహారాజా '#RT68' షూటింగ్ షురూ..!

Update: 2021-07-01 05:09 GMT
మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి' మూవీ సెట్స్ పై ఉండగానే ఇటీవల మరో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న 68వ చిత్రంతో శరత్‌ మండవ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #RT68 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు గురువారం (జులై 1) హైదరాబాద్‌ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో రవితేజ మరియు ఇతర ప్రధాన తారాగణమంతా పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సందర్భంగా #RT68 చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రవితేజ ఓ కుర్చీపై కూర్చోని ఉండగా.. ఎదురుగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డు కనిపిస్తుంది. అలానే ఓ ప్రభుత్వ అధికారి ప్రమాణ స్వీకారం చేసిన ఒక పాత లెటర్ ను కూడా ఈ పోస్టర్ లో చూపించారు. ఇక రవితేజ ముందున్న టేబుల్ పై టైప్‌ రైటర్ - ఫైల్స్ మొదలైనవాటిని గమనించవచ్చు. ఇదంతా చూస్తుంటే ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడని అర్థం అవుతోంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన కథతో ఈ స్పెషల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆయన డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ - ఈరోజుల్లో శ్రీ - సురేఖ వాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    

Similar News