తమిళ హీరో ధనుష్ తొలిసారి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం `సార్`. తమిళంలో ఈ మూవీని `వాతి` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. `భీమ్లానాయక్` ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
తొలి సారి ధనుష్ తెలుగులో చేస్తున్న ద్విభాషా చిత్రం కావండతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పడెప్పుడు విడుదలవుతుందా అని ఈ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు ఎండింగ్ దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం లిరికల్ వీడియోలతో ఈ మూవీ ప్రచార పర్వానికి తెరలేపింది. ఇందులో భాగంగానే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ గా `మాస్టారు.. మాస్టారు..` అంటూ సాగే లిరికల్ వీడియోని గురువారం విడుదల చేసింది.
తిరుపతి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్ గా పని చేసే బాల గంగాధర్ తిలక్ చుట్టూ జరిగే కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. `మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు..అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు.. అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ కు జాతీయ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా,, తమిళంలో ఈ పాటని ధనుష్ రాశారు. తెలుగులో సరస్వతీ పుత్ర రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. శ్వేతా మోహన్ ఆలపించారు.
ఇదొక కాలేజీ నేపథ్యంలో సాగే మాంటేజ్ సాంగ్. పాట చిత్రీకరణ కూడా అంతే అందంగా, హీరో, హీరోయిన్ ల మధ్య సాగే అనుబంధం నేపథ్యంలో సాగిన తీరు ధనుష్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో హీరోపై తనకున్న ఇష్టాన్ని హీరోయిన్ వ్యక్తం చేస్తూ ఊహల్లో తేలిపోతున్నట్టుగా చూపించారు. రామ్ జో అందించిన పదాలు శ్రావ్యంగా వున్నాయి. జీవీ ప్రకాష్ సంగీతానికి అనుగుణంగా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు.
హాఫ్ షర్ట్.. లాంగ్ హెయిర్ తో ధనుష్ కనిపిస్తుండగా హీరోయిన్ సంయుక్త మీనన్ సంప్రదాయ బద్దమైన సారీలో కనువిందు చేస్తోంది. ఈ లిరికల్ వీడియోలో ధనుష్, సంయుక్త మీనన్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. అది తెరపై మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటలో `సీతాకాలం మనసే నీ మనసున చోటడిగిందే...సీతకు మల్లే నీతో .. అంటూ రామజోగయ్య శాస్త్రి చేసిన పదాల మ్యాజిక్ పాటకు మరింత ప్రాణం పోసింది.
ఇక శ్వేతా మోహన్ గాత్రం ఈ పాటని మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వుంది. ఖచ్చితంగా ఈ మెలోడీ గీతం సినిమాకు మరింతగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అనూహ్య స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ తో ఎలాంటి సర్ ప్రైజ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఇందులో సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీనివాస్, పమ్మి సాయి, హైపర్ ఆది, షరా, ఆడుకాలం నరేన్, ఇళవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View