కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజిని తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ కలిగిన హీరో ఇళయదళపతి విజయ్. గత కొన్నేళ్లుగా విజయ్ సినిమాలన్ని పైసావసూల్ సినిమాలుగా మారాయి. మాములుగా విజయ్ సినిమా వస్తుందంటేనే అభిమానులు ఓ రేంజిలో సందడి చేస్తారు. థియేటర్లలో కలెక్షన్స్ కూడా అదిరిపోతాయి. అలాంటిది కరోనా లాంటి బిగ్ బ్రేక్ తర్వాత విడుదల అయితే ఫ్యాన్స్ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రస్తుతం తమిళనాడు థియేటర్ల వద్ద చూడవచ్చు.
అయితే గతేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన మాస్టర్ సినిమా.. వాయిదాపడుతూ ఈ సంక్రాంతికి విడుదల అయింది. ప్రస్తుతం పైసావసూల్ మూవీ అనిపించుకుంది. భారీ రేంజిలో విడుదలైన మాస్టర్ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తుందట. తాజాగా ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా మాస్టర్ కలెక్షన్స్ వివరాలు బయటపెట్టాడు.
మాస్టర్ సినిమా కేవలం తమిళనాడు వరకే మూడు రోజుల్లో యాభై కోట్లు వసూల్ చేసిందని తెలిపాడు. అలాగే ఇంకా మాస్టర్ సినిమాకోసం థియేటర్ల వద్ద జనాలు ఎగబడుతూనే ఉన్నారని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. జైల్లో పిల్లలను చెడుదారి పట్టించే విలన్ పాత్రలో విజయ్ సేతుపతి, అదే జైల్లో పిల్లలను సరైన దారిలో పెట్టడానికి వచ్చిన మాస్టర్ పాత్రలో దళపతి విజయ్ అలరించారు. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ ఈ ఇద్దరు విజయ్ ల కాంబినేషన్ హైలైట్ అయింది.
ఇక ఇద్దరి యాక్టింగ్, ఫైట్ సీక్వెన్స్ పీక్స్ అనాలి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మాస్టర్ సినిమాను హిందీలో రీమేక్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. షైన్ ఇండియా, సినీ1 స్టూడియోస్, 7స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తరన్ ఆదర్శ్ తెలిపాడు. ఇక త్వరలోనే మాస్టర్ హిందీ నటుల ఎంపిక స్టార్ట్ అవుతుందని సమాచారం