కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’. సంక్రాంతి ఫెస్టివల్ ను మరింత కలర్ ఫుల్ గా మార్చేందుకు ఈ చిత్రం పొంగల్ కి థియేటర్లలోకి రాబోతోంది. తమిళ్, తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు సడన్ డెసిషన్ ఒకటి తీసుకున్నారు మేకర్స్.
థియేటర్లు తిరిగి ప్రారంభమైన తర్వాత విడుదల కాబోతున్న పెద్ద మూవీ ‘మాస్టర్’. ఈ చిత్రంపై ప్రేక్షకులతోపాటు పరిశ్రమ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక, విజయ్ అభిమానులైతే ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
ఈ సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ‘మాస్టర్స్’ మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. తమిళ, తెలుగు భాషలతోపాటు హిందీలోనూ ఒకేసారి విడుదల అవుతుందని వెల్లడించారు. ఈ వార్తతో తలపతి అభిమానులు మరింత ఖుషీ అయ్యారు. అయితే.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మార్చడానికి ఈ సమయం సరిపోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘మాస్టర్’ థియేటర్లోకి రావడానికి మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో హిందీలోకి సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్లడం సాధ్యమేనా? అనే అనే డౌట్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు సినీ జనాలు. హిందీలో ప్రమోషన్ చేయడానికి ఈ కొద్ది సమయం చాలకపోవచ్చేమో అని అంటున్నారు. అయితే.. ఇవన్నీ ఆలోచించకుండా మేకర్స్ ఉండరు కాబట్టి.. ఏం జరుగబోతోంది? నార్త్ ఆడియన్స్ ను ఈ దక్షిణాది ‘మాస్టర్’ ఎంతమేర ప్రభావితం చేస్తాడు? అన్నది తెలియాలంటే.. రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. విజయ్ సేతుపతి, ఆండ్రియా, మాలవికా మోహనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. జేవియర్ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.