దేశంలో కరోనా ప్రభావం రోజురోజుకి అధికం అవుతుంది. ఈ కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దేశంలో సినిమా రంగం ఒక్కసారిగా స్థంభించి భారీ నష్టాల్లో కురుకుపోతుంది. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ప్రజలందరికి సినిమాలతో మస్త్ టైంపాస్ అవుతుంది. అదే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు థియేటర్లు మూసివేసి సైలెంట్ అయింది. ఈ సమ్మర్‌లో సీజన్‌లో విడుదల కావాల్సిన సినిమాల జాబితా పెద్దగానే ఉంది. కానీ కరోనా కారణంగా అన్నీ వాయిదా పడ్డాయి. తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ నటించిన కొత్త సినిమా ‘మాస్టర్’ ఎప్పుడో విడుదలకు సిద్ధమైంది.
‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ‘మాస్టర్’ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇటీవలే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని విజయ్ మాస్టర్ సినిమా థియేటర్లో కాకుండా డిజిటల్ రిలీజ్ చేస్తారని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అయితే తాజాగా మాస్టర్ సినిమా దర్శకనిర్మాతలు ఈ వార్తల పై స్పందించారు.
వారు మాస్టర్ డిజిటల్ రిలీజ్ అనే విషయాన్నీ ఖండించారు. ఇక ఈ సినిమాను ఎంత ఆలస్యం అయినా థియేటర్లలోనే విడుదల చేస్తామని తేల్చి చెప్పేసారు. పుకార్లు నమ్మకండి. మాస్టర్ సినిమా ఎంత ఆలస్యం అయినా థియేటర్లోకే రానుంది. అది ఈ ఏడాది దసరా కావచ్చు లేదా వచ్చే సంక్రాంతి కావచ్చు. కానీ డిజిటల్ రిలీజ్ మాత్రం నిజం కాదు. ఈ మహమ్మారి ఎఫెక్ట్ ఎప్పుడు తగ్గితే అప్పుడు విడుదల చేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.