హమ్మయ్య.. మాస్టర్‌ ఊపిరి పీల్చుకో

Update: 2021-01-12 08:00 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటించిన 'మాస్టర్‌' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. తమిళనాడులో ఈ సినిమాకు మొదట 100 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శించుకునే అనుమతులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం తప్పుబడట్టడంతో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. దాంతో తమిళనాట కలెక్షన్స్‌ ప్రభావం పడే అవకాశం ఉందని అంతా అంటున్నారు. ఇదే సమయంలో కేరళలో థియేటర్ల యాజమాన్యాలు మరియు ఎగ్జిబ్యూటర్లు ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ బొమ్మ పడేనా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కేరళలో థియేటర్ల ఓపెన్‌ కు మార్గం సుగమం అయ్యింది. సీఎం విజయన్‌ స్పందించి లైసెన్స్ ఫీజు గడుపు పొడగించడంతో పాటు థియేటర్లు మూత పడ్డ కాలానికి ట్యాక్స్ కట్‌ చేయడంతో పాటు కరెంటు బిల్లును 50 శాతం తగ్గించేందుకు ఓకే చెప్పారు. థియేటర్ల యాజమాన్యాల డిమాండ్లు అన్నింటికి దాదాపుగా కేరళ ప్రభుత్వం ఓకే చెప్పింది. దాంతో నేటి నుండే థియేటర్లు పునః ప్రారంభంకు సిద్దం అయ్యాయి. కేరళలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న విజయ్ మూవీ మాస్టర్ ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాస్టర్ సినిమా కేరళలో ఉంటుందా ఉండదా అనే విషయమై క్లారిటీ రావడంతో మేకర్స్‌ ఊపిరి పీల్చుకుంటున్నారు. 
Tags:    

Similar News