మాస్ట‌ర్ .. ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఓకే కానీ!

Update: 2020-03-13 07:05 GMT
ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌మిళ నాట బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తెలుగులో మాత్రం ఇంకా అత‌డికి స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ద‌క్క‌లేదు. మెర్స‌ల్ చిత్రం అదిరింది పేరుతో రిలీజైనా ఆశించినంత ప్ర‌భావం చూప‌ లేక‌పోయింది. తుపాకీ లాంటి క్లాసీ చిత్రం తెలుగు ఆడియెన్ ని కేవ‌లం బుల్లితెర‌పై మాత్ర‌మే మెప్పించ‌గ‌లిగింది. ఇక్క‌డ విజ‌య్ క్రేజు అంతంత మాత్ర‌మే కాబ‌ట్టి అత‌డు ఎంత పెద్ద మాస్ట‌ర్ క్లాస్ ప్ర‌య‌త్నం చేసినా.. ఇక్క‌డ మాత్రం ఫెయిల‌వుతూనే ఉన్నాడు. అయితే తెలుగు ఆడియెన్ ని మెప్పించాలంటే అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు అవ‌స‌రం అని గ్ర‌హించిన విజ‌య్ ఇక్క‌డా ప్ర‌చారంలో వేడి పెంచాల‌ని గ్ర‌హించాడు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న‌కు స‌రైన స‌పోర్ట్ ద‌క్క‌లేదు. క‌నీసం ఈసారైనా మార్పు అవ‌స‌రం అని భావించిన‌ట్టే క‌నిపిస్తోంది.

మొన్న వ‌చ్చిన `విజిల్` పై అత‌డు చాలా హోప్స్ పెట్టుకున్నా.. మ‌రోసారి నిరాశ‌నే మిగిలింది. ఇక్క‌డ‌ స‌రైన రెస్పాన్స్ లేక‌పోవ‌డం త‌న‌ని నిరాశ‌ప‌రిచింది. అందుకే ఇక‌నైనా కాస్త జాగ్ర‌త‌ప‌డాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న `మాస్ట‌ర్` చిత్రం త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. విజ‌య్ ఈ పోస్ట‌ర్ లో మాస్ ట‌చ్ తో క‌నిపిస్తున్నాడు. మ‌నిషిలో మ‌నిషి.. అంత‌ర్మ‌థ‌నాన్ని ఆవిష్క‌రిస్తున్న పోస్టర్ ర‌క్తి క‌ట్టిస్తోంది. ఇక ఈ పోస్ట‌ర్ లో కాన్సెప్ట్ చూస్తుంటే మ‌రోసారి ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఖైదీ త‌ర‌హాలోనే ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ గేమ్ నేప‌థ్యం లో సినిమాని తీస్తున్నాడా? అన్న‌ ఆస‌క్తిని పెంచుతోంది.

అయితే ఈ క్యూరియాసిటీ నిల‌బ‌డాలంటే మునుప‌టితో పోలిస్తే ప్ర‌చారం ప‌రంగా మ‌రింత స్పీడ్ చూపించాల్సి ఉంటుంది. ఏదో డబ్బింగ్ సినిమానే క‌దా! అంటూ లైట్ తీస్కుంటే అది విజ‌య్ ప్ర‌య‌త్నానికి గండి కొట్టేసిన‌ట్టే అవుతుంది. మంచి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటారా లేదా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News