గోకుల్ చాల్ - లుంబినీ పార్క్ బాంబ్ బ్లాస్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్. కింగ్ నాగార్జున హీరోగా అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దియా మీర్జా- సయామీ ఖేర్ ఈ చిత్రంలో కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి నిరంజన్‌రెడ్డి- అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా `వైల్డ్‌డాగ్ బేస్ క్యాంప్` పేరుతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేదికపై గుండె ఈసీజీ గురించిన వర్ణణతో మయాంక్.. అలీరెజా స్పీచ్ లు ఆకట్టుకున్నాయి.
``ఆరోగ్యవంతుడైన మానవుడి ఈసీజీలో హెచ్చుతగ్గులుంటాయి. స్ట్రెయిట్ లైన్ ఉంటే మనిషి చనిపోయినట్టు. వైల్డ్ డాగ్ రాకముందు నా ఈసీజీ లెవెల్ కింది స్థాయిలో ఉంది.. నాగార్జున సర్ తో మొదటి సారి షూటింగ్ చేసినప్పుడు ఈసీజీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. మధ్యలో కరోనా రావడంతో మళ్లీ తగ్గిపోయింది.. ఇక షూటింగ్ ఉంటుందా? లేదా? అని డిప్రెషన్ వల్ల కిందకు వచ్చింది. మళ్లీ షూటింగ్ స్టార్ట్ అన్నప్పుడు ఈసీజీ మళ్లీ మీదకు వెళ్లింది. ఇక ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి మరింత పైకి వెళ్లింది. ఈ మూవీ ఏప్రిల్ 2న రాబోతోంది. అందరూ చూడండి`` అని నటుడు మయాంక్ అన్నారు.
నా జీవితాన్ని మార్చే శుక్రవారమిది అంటూ అలీ రెజా ఈ వేదికపై ఎమోషన్ అవుతూ..మయాంక్ చెప్పినట్టు నాకు ఈసీజీ పెరుగుతూ వచ్చిందని అన్నారు. అతడు వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ``బిగ్ బాస్ తరువాత ఇది నా పెద్ద రిలీజ్.. ఈ సమయం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. మయాంక్ చెప్పినట్టు నాకు ఈసీజీ పెరుగుతూ వచ్చింది. మామూలుగా నటులకు శుక్రవారం అంటే ఎంతో ప్రత్యేకం. సినిమాలన్నీ శుక్రవారమే వస్తుంటాయి. ఎందరో జీవితాలను శుక్రవారం మార్చేస్తుంది. ఏప్రిల్ 2 నా జీవితాన్ని మార్చే శుక్రవారం.. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్`` అని అన్నారు.