తాప్సీ వాగుడికి నిర్మాతలు బలి

Update: 2017-07-10 11:16 GMT
ఢిల్లీ భామ తాప్సీ పన్నుకు ఈ మధ్య నోటి దురుసు పెరిగిపోయి.. ఏది పడితే అది వాగుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో గంగ సక్సెస్ తర్వాత.. హిందీలో ఛాన్స్ లు రావడం.. అక్కడ పింక్ అంటూ అమితాబ్ తో కలిసి హిట్ కొట్టేయడంతో.. తాప్సీకి ఇక పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సౌత్ లో తన అందాన్ని తప్ప ట్యాలెంట్ ను చూడలేదంటూ.. కొన్నిసార్లు మాట్లాడి మళ్లీ సైలెంట్ అయిన తాప్సీ.. రీసెంట్ గా మళ్లీ నోరు పారేసుకుంది.

బొడ్డుమీద కొబ్బరి చిప్పలు పెట్టి కొట్టడం ఏం సరసమో అంటూ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు మేకింగ్ ను కూడా తప్పు పట్టింది. తెలుగు సినిమాపై.. టాలీవుడ్ జనాలపై విమర్శలు గుప్పించిన తాప్సీపై.. ఇప్పుడు అందరూ భగ్గుమంటున్నారు. పైగా.. మరి కొన్ని రోజుల్లో ఈమె నటించిన ఆనందో బ్రహ్మ విడుదల కావాల్సి ఉన్న సమయంలో తాప్సీ ఇలా నోరు చేసుకోవడం.. గమనించాల్సిన విషయం. ఆనందో బ్రహ్మ సినిమా అంతా పూర్తి చేసేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తుండగా.. ఇప్పుడు తాప్సీని బాయ్ కాట్ చేయాలంటూ.. ఆమెకు ఇక్కడ ఆదరణ ఉండదంటూ.. సోషల్ మీడియాలో కేంపెయిన్ ఊపందుకోంది.  పైగా ఆనందో బ్రహ్మ ప్రచారం కోసం ఈమె హైద్రాబాద్ వస్తే.. తాప్సీ ప్రెస్ మీట్స్ ను బాయ్ కాట్ చేయాలని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి.. ఆనందో బ్రహ్మ మేకర్స్ తలలు పట్టుకోవాల్సి వస్తోంది.

ఒకవేళ తేడా వస్తే మాత్రం.. అసలే ఈ సినిమాకు తాప్సీ ఒక్కత్తే లీడ్ కాబట్టి.. ప్రమోషన్లకు గండి పడిపోయి.. సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. ఒకవేళ తాప్సీ వచ్చినా కూడా.. ముందుగా అమ్మడు తన కామెంట్లపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఏ విధంగా వివరణ ఇచ్చినా కూడా.. అసలు తన మాటలను ఈ పాపాయ్ ఎలా సమర్ధించుకుంటుంది? నోరు జారేసింది అంతే.. ఇప్పుడు కష్టం!!
Tags:    

Similar News