ఆ మీడియా సినిమాను అర్ధం చేసుకోవట్లేదా?

Update: 2017-02-01 22:30 GMT
ప్రతీ వారం ఒకట్రెండు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. మిగిలిన మార్కెట్లను వదిలేసి టాలీవుడ్ వరకూ చూసుకున్నా.. దేశంలో బాలీవుడ్ తర్వాత మనదగ్గరే ఎక్కువ సినిమాలు రూపొందుతాయి. అన్నిటినీ అందరూ చూడ్డం అనేది దాదాపు అసంభవమే. ఓ సినిమాను చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకునేందుకు గతంలో మౌత్ టాక్ కీలకం అయితే.. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.

అలాగని సోషల్ మీడియా అభిప్రాయాల ఆధారంగా సినిమాలు ఆడేస్తున్నాయా అంటే అది కూడా జరగడం లేదు. ఆన్ లైన్ తెగ పొగడ్తలు వస్తే అవి డింకీ కొట్టేసిన సందర్భాలు.. సోషల్ మీడియాలో విమర్శలు వస్తే విపరీతంగా ఆడేసిన సినిమాలు కూడా ఉంటున్నాయి. గతేడాది వచ్చిన జనతా గ్యారేజ్ మూవీకి విమర్శలే ఎక్కువగా వచ్చాయి. వీటిపై సమంత ఓపెన్ గానే కస్సుబుస్సులాడింది. కానీ మూవీ మాత్రం ఇండస్ట్రీ హిట్స్ లో చేరిపోయింది.

'జనాలు ఎంటర్టెయిన్మెంట్ కోరుకుంటారు. ఓ సినిమాను చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి 100శాతం పాజిటివ్ రియాక్షన్ ఎవరూ కోరుకోవడం లేదు. ఓ 60 శాతం మంది సానుకూలంగా ఉన్నా సరిపోతుంది' అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. 'సోషల్ మీడియాలో క్రిటిక్స్ కు కమర్షియల్ సినిమాలను విమర్శించడం అలవాటు అయిపోయింది. రొటీన్ అంటూ విమర్శించేస్తున్నారు. కానీ వాటికి వస్తున్న కలెక్షన్స్ చూస్తే ఇండస్ట్రీకి కూడా మైండ్ బ్లాంక్ అవుతోంది' అంటున్నాడు ఓ దర్శకుడు.

మరీ ఒకటే ఫార్ములాతో వచ్చేసి.. శ్రీను వైట్ల-కోన వెంకట్ టైపులో బోరు కొట్టించేస్తే తప్ప.. ఆడియన్స్ రిజెక్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో రామ్ చరణ్ రచ్చ చిత్రానికి విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం హిట్ సాధించింది ఈ చిత్రం. రీసెంట్ గా ఖైదీ నంబర్ 150 విషయానికి వస్తే.. చిరంజీవి మినహాయిస్తే.. మిగతా అంతా రొటీన్ అనేశారు. అయినా సరే.. ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి.. పాత రికార్డులను తుడిచిపెట్టేసింది.

అలాగని ఆన్ లైన్ లో తెగ పొగిడేసి సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా నిలుస్తున్నాయి. మోహన్ లాల్ నటించిన మనమంతాకు విపరీతమైన పాజిటివ్ రివ్యూలు.. మౌత్ టాక్.. సోషల్ మీడియా కామెంట్స్ వచ్చాయి. అయినా సరే ఈ సినిమా ఫెయిల్యూర్స్ గా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

పెళ్లి చూపులు విషయంలో కూడా ఇలాగే జరిగింది. పెళ్లిచూపులు ఏ సెంటర్లకు తప్ప ఎవరికీ ఎక్కదు అనే అభిప్రాయం వ్యక్తమైతే.. అన్ని ఏరియాల్లో ఇరగదీసి ఆడేసింది పెట్టుబడికి ఎన్నో రెట్లు సంపాదించి పెట్టింది. మొత్తంమీద సోషల్ మీడియా సినిమాల రిజల్ట్ ను డిసైడ్ చేసే స్థాయికి ఎదగకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎక్కడా లేని స్థాయిలో మన దగ్గర ఉన్న గ్రూపుల సంస్కృతి ఉండడం.. ఉద్దేశ్య పూర్వకంగా నెగిటివ్ ప్రచారం.. ట్రాలింగ్ చేస్తుండడంతో.. ఈ పవర్ ఫుల్ మీడియాని సినిమా ప్రేమికులు పట్టించుకోవడం మానేశారనే మాట మాత్రం ఒప్పుకోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News