హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ కు.. ఇప్పుడు టైమ్ బాగున్నట్టుగా ఉంది. అందుకే వరుసపెట్టి సినిమాలు హిట్టు కొడుతూ... అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. స్టార్ హీరో అవ్వకముందే... గంటలు తరబడి వెయిటింగ్ చేయించడం అలవాటు చేసుకున్నట్టున్నాడు నిఖిల్. అందుకే ఒక కార్యక్రమం కోసం కొంతమంది కాలేజీ పిల్లలను గంటలు తరబడి వేచి ఉండేలా చేశాడట.
నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా కిర్రాక్ పార్టీ. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీవీతో కలిసి ఒక కార్యక్రమం ప్లాన్ చేసింది చిత్రయూనిట్. కొంత మంది కాలేజీ కుర్రకారుతో...నిఖిల్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ కార్యక్రమాన్ని హోలీ సందర్భంగా నిన్న పది నుంచి 12 గంటల మధ్యలో ప్లాన్ చేసింది ఎన్టీవీ. ఆ సమయానికి కల్లా వచ్చేస్తానన్నా నిఖిల్... పది దాటినా రాలేదు. నిర్వాహకులు ఫోన్ చేస్తే పదినిమిషాల్లో అక్కడుంటా అని చెప్పాడు. గంటలు గడిచినా స్పాట్ కు రాలేదు. చివరికి రెండున్నరకు వచ్చాడు. తన కోసం చాలా మంది ఎదురుచూస్తారని తెలిసి కూడా అతనిలా చేయడం అస్సలు బాగోలేదంటూ విసుక్కుంటున్నారు చాలా మంది. ఆ కార్యక్రమం రికార్టు చేసేది కనుక సరిపోయింది... అదే లైవ్ పెట్టుకుంటే... ఏమవుతుంది. నిఖిల్ చేసిన పనికి ఛానళ్లు నవ్వులపాలయ్యేవి.
ఎంత పెద్ద నటుడికైనా క్రమశిక్షణ చాలా ముఖ్యం. చెప్పిన సమయానికి... చెప్పిన పనులు చేసేయ్యాలి. లేకుంటే పది మంది చేత మాటలు పడాల్సి వస్తుంది. పదేళ్ల కెరీర్‌లో నిఖిల్ గొడవలకు - వివాదాలకు దూరంగా ఉంటూనే వచ్చాడు. మరిప్పుడు వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో. కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు ... ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు.