స్నేహితుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవకొండ నిర్మించిన చిత్రం `మీకు మాత్రమే చెప్తా`. వాణి భోజన్- అనసూయ- అభినవ్ గోమటం కీలక పాత్రధారులు. షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం సినిమా రిలీజైంది. మీకు మాత్రమే చెప్తా సింపుల్ స్టోరీలైన్ తో తెరకెక్కిన మంచి ఫన్ రైడ్ మూవీ అని.. హాయిగా నవ్వుకోవచ్చు అని ప్రశంసలు దక్కాయి. నేటి తరానికి కనెక్ట్ అయ్యే కథాంశంతో పాయింట్ ఫ్రెష్ గా ఆకట్టుకుంది. హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ కూడా తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అనసూయ.. అభినవ్ పాత్రలకు పేరొచ్చింది.
అదంతా సరే.. వసూళ్ల సంగతేమిటి? అంటే ఈ సినిమాకి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదరణ బావుందని తెలుస్తోంది. అర్బన్ ఆడియెన్ కి బాగా కనెక్టవ్వడంతో మౌత్ పబ్లిసిటీ బాగానే ఉంది. కామెడీ ఈ సినిమాకి ప్లస్ అయ్యిందని.. ట్విస్టులు ఆకట్టుకున్నాయని పబ్లిక్ లో టాక్ వినిపిస్తోంది. పెళ్లి చూపులు తర్వాత కామెడీ బాగా వర్కవుటైంది అంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో మల్లీప్లెక్స్ కలెక్షన్స్ బావున్నాయని రిపోర్ట్ అందింది. ఇక ఆన్ లైన్ టికెటింగ్ పరంగానూ జోరుగానే ఉంది.
పరిమిత బడ్జెట్ తో తీసిన సినిమా తరుణ్ భాస్కర్ కి యువదర్శకుడికి పేరు తెచ్చింది కాబట్టి వాళ్లకు మరో ఛాన్సుంటుందనడంలో సందేహం లేదు. ఇక తొలి వీకెండ్ నాటికి పంపిణీదారులు సేఫ్ అవుతారా లేదా? అసలు కలెక్షన్స్ పరంగా మైలేజ్ ఎలా ఉంటుంది? అన్నది రిపోర్ట్ అందాల్సి ఉంది.