పెళ్లి కోసం అంత కష్టపడితే.. ఇలా అయ్యిందేంటి

Update: 2016-12-12 11:22 GMT
భద్ర.. గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది మలయాళ కుట్టి మీరా జాస్మిన్. పవన్ తో నటించాక ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్న మీరా.. అనుకోకుండా డౌన్ అయింది. ఆ తర్వాత చిన్నా చితకా సినిమాల్లో నటించి కనుమరుగైపోయింది. ఐతే తమిళం.. మలయాళంలో మాత్రం చాలా ఏళ్లు హవా సాగించింది మీరా.

హీరోయిన్ గా మంచి స్వింగులో ఉండగానే.. మాండలిన్ రాజేష్ అనే మ్యుజీషియన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచిన మీరా.. ఆ తర్వాత అతడితో బ్రేకప్ చేసుకుంది. రెండేళ్ల కిందట వివాదాస్పద రీతిలో అనిల్ జాన్ టైటస్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది మీరా. అనిల్ జాన్ కు అప్పటికే పెళ్లయిఉండటం.. విడాకులు తీసుకోవడం గమనార్హం. అతడి మాజీ భార్య తరఫు బంధువులు దాడి చేయబోతే.. పోలీసుల రక్షణ కోరి.. వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అనిల్-మీరా.

ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్న మీరా.. అనిల్.. రెండేళ్లు తిరిగేసరికి విడిపోతుండటం ఆశ్చర్యం. పెళ్లయిన ఏడాదికే వీళ్లిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయట. ఏడాది నుంచి విభేదాలతోనే కలిసి సాగుతున్న ఈ జంట.. చివరికి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేసింది. మీరా ఇప్పటికే అనిల్ కు దూరంగా ఉంటోంది. అతడికి దూరమయ్యాకే మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేయడానికి కూడా రంగం సిద్ధంచేసుకుంది. ఆల్రెడీ ఒక సినిమాలో కూడా నటించింది. చాలామంది హీరోయిన్ల లాగే మీరా కూడా వైవాహిక జీవితంలో విఫలం కావడం విచారించాల్సిన విషయం.
Tags:    

Similar News