తమిళ సినీ అభిమానులతో పాటు తెలుగులో కూడా సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్ అయిన ముద్దుగుమ్మ మీరా మిథున్. బిగ్ బాస్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న ఈ నటి ఈమద్య కాలంలో పబ్లిసిటీ కోసం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది. తమిళంకు చెందిన పెద్ద హీరోలు మరియు హీరోయిన్స్ ను ఈమె విమర్శించడంతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి వారి అభిమానుల చేత సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంది. ఒక టాప్ స్టార్ హీరోయిన్ పై ఈమె చేసిన కామెంట్స్ మరీ సిల్లీగా ఉన్నాయి. ఆ స్టార్ హీరోయిన్ తన స్టైల్ ను మరియు తన మేకప్ విధానంను కాపీ కొడుతుందని.. ఆమె నా స్టైల్ ను కాపీ కొట్టడం వల్లే అంత పెద్ద స్టార్ అయ్యింది అంటూ నోటికి ఎంత వస్తే అంత.. ఎలా వస్తే అలా అన్నట్లుగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది. పబ్లిసిటీ కోసం సెలబ్రెటీలను విమర్శించిన మీరా మిథున్ ఈమద్య మరీ శృతి మించింది.
ఇటీవల కొన్ని సామాజిక వర్గాల వారిని మరియు సామాజిక సేవ చేసే కార్యకర్తలను అవమానించేలా మాట్లాడింది. సోషల్ మీడియాలో ఈమె బీసీ కులాలు మరియు ఎస్సీ ఎస్టీ కులాలపై అనుచిత వ్యాఖ్యాలు చేసింది. నెట్టింట ఈమె వ్యాఖ్యలు దుమారంను రేపాయి. అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ వ్యాఖ్యలపై పలు ప్రజా సంఘాల వారు చాలా సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే ఆమె విషయంలో పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాల్సిందే అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సంఘాలు మరియు వ్యక్తిగతంగా కూడా మీరా మిథున్ పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
తమను అవమానించేలా వ్యాఖ్యలు చేసిందని కొందరు.. తమ అభిమాన హీరో మరియు హీరోయిన్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది అంటూ కొందరు వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ఆమెపై ఇప్పటికే 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ కేసులు విచారణ జరుగుతున్నాయని కూడా వారు తెలియజేశారు. ఏ సమయంలో అయినా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.