బిగ్ బాస్ బ్యూటీ ట్రీట్ ఆఫ‌ర్ చేస్తోంది.. రెడీగా ఉండండి!

Update: 2020-11-20 12:50 GMT
వివాదంతో ప్ర‌చారం నేటి ట్రెండ్. ఈ త‌ర‌హాలో రామ్ గోపాల్ వ‌ర్మ‌.. శ్రీ‌రెడ్డి .. వీళ్లంద‌రిదీ ఒక త‌ర‌హా అయితే త‌మిళ బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ శైలి వేరొక ర‌కం. ఈ అమ్మ‌డు ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు. అప్ప‌ట్లో బిగ్ బాస్ సీజ‌న్ 3లో ర‌క‌ర‌కాల వివాదాల‌తో పాపులారిటీ పెంచుకుని వ‌రుస‌గా సినీ ఛాన్సులు అందుకున్న ఈ బ్యూటీ .. త‌మిళ స్టార్ హీరోలు విజ‌య్ .. అజిత్ లు త‌న‌ని ఇబ్బందికి గురి చేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. సూర్య‌.. త్రిష.. జ్యోతిక.., ఐశ్వర్య రాజేశ్ సహా ఎంతో మందిపై మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

బ‌యాల‌జీలో పీహెచ్ డి చేసి అటుపై రంగుల ప్ర‌పంచంపై ప్రేమ‌తో ఇటువైపు అడుగులు వేసిన ఈ అమ్మ‌డు కొరియోగ్రాఫ‌ర్ ప్రోత్సాహంతో మోడ‌లింగ్ కూడా చేసింది. ఇప్పుడు సినీవినీలాకాశంలో అగ్ర తార‌గా ఎద‌గాల‌న్న క‌సితో ప‌ని చేస్తోంద‌ట‌. 2015లో ‘ఎన్నై అరిందాల్' అనే సినిమాతో తెరంగేట్రం చేసి అటుపై ‘గగ‌నంస‌..., ‘8 తొట్టక్కల్స‌,... ‘తానా సెర్న్‌దా కొట్టంస‌, .... ‘బాదై ఏరి బుద్ది మారి' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డుచెప్ప‌ని భామ‌గా పాపుల‌రైన మీరా మిథున్ ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది. సోష‌ల్ మీడియాల్లో ఇత‌ర నాయిక‌ల‌కు ధీటుగా వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తోంది. ఇటీవ‌ల వ‌రుస వివాదాల‌తో అట్టుడికించిన ఈ అమ్మ‌డు ద‌ర్శ‌కుడు భార‌తీరాజాతోనూ ఈ అమ్మ‌డు వివాదంలో ఇరుక్కుంది. త‌న‌పై పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తాజాగా టాప్ లెస్ ఫోజుతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ‘సెక్సీ ట్రీట్‌కు రెడీగా ఉండండి' అంటూ నెటిజనుల‌కు అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News