మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో మొత్తానికి ఒక మంచి టాక్ అయితే అందుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా సినిమా పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆచార్య సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో గాడ్ ఫాదర్ సినిమాతో మళ్ళీ ట్రాక్లోకి రావాలని అనుకున్నారు. మొత్తానికి టాక్ పరంగా అయితే గాడ్ ఫాదర్ సంతృప్తిని ఇచ్చింది.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మరికొన్ని కలెక్షన్స్ వస్తే మాత్రం సినిమా సక్సెస్ అయినట్లు లెక్క. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో మరింత బిజీగా మారిపోయారు. ముందుగా వాల్తేరు వీరయ్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాబి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
రవితేజ కూడా ఒక ముఖ్యమైన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు కూడా జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా అధికారికంగా మాత్రం క్లారిటీ రాలేదు త్వరలోనే చిత్ర యూనిట్ సభ్యులు పోస్టర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా మెగాస్టార్ 154 సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు బాబి అయితే ప్రమోషన్స్ విషయంలో కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే విధంగా ఆలోచిస్తున్నాడు. ముందుగా దీపావళికి టీజర్ ను విడుదల చేసి ఆ తర్వాత మళ్లీ తొందరగానే మొదటి పాటను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఇక ఈ సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన చర్చల ప్రకారం అయితే వాల్తేరు వీరయ్య సినిమాను 2023 జనవరి 11వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక అదే సమయంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా రాబోతోంది. పోటీలో నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కూడా ఉంది. ఇక విజయ్ వారసుడు సినిమా కూడా సంక్రాంతి ఫెస్టివల్ లో పోటీ పడబోతోంది. మరి ఈ క్లాష్ లో మెగాస్టార్ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.