సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కి ఇటీవలే జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక నిర్మించిన విషయం తెల్సిందే. ఆమె గతంలో పలు షార్ట్ ఫిల్మ్ మరియు వెబ్ సిరీస్ లను నిర్మించింది. యూట్యూబ్ కంటెంట్ ను నిర్మించి మెప్పించిన నిహారిక మొదటి సారి ఒక సినిమాను నిర్మించింది. జీ5 స్టూడియోస్ వారితో కలిసి ఈ సినిమాను నిహారిక నిర్మించింది. తాను ఈ సినిమా నిర్మిస్తున్న విషయం నాన్న నాగబాబుకు కూడా తెలియదు అంటూ ఆమద్య నిహారిక చెప్పుకొచ్చింది. మంచి కథను ఎంపిక చేసుకుని అందుకు తగ్గట్లుగా నటీ నటులను కూర్చి సినిమాను చేయడం అంటే మామూలు విషయం కాదు. నిహారిక తన గత అనుభవంతో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని సక్సెస్ ఫుల్ గా నిర్మించింది.
కూతురు నిహారిక నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. తమ్ముడు కూతురు అయినా కూడా నిహారికను చిరు సొంత కూతురులాగే భావిస్తాడు. నిహారిక కూడా చిరంజీవిని డాడీ అనే పిలుస్తుందట. అలాంటి నిహారిక సినిమా నిర్మాణంలో అడుగు పెట్టి మొదటి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ ను దక్కించుకోవడంతో చిరంజీవి తన శుభాకాంక్షలు తెలియజేశాడు. ట్విట్టర్ ద్వారా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను. ఎంతో ఎంటర్ టైనింగ్ గా ఉంది. నిర్మాణంలో తన తొలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా.. వినోదాత్మకంగా.. తీసి ప్రేక్షకులను మెప్పించిన కొణిదెల వారి ఆడబడుచు నిహారికకు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు అందరికి కూడా నా అభినందనలు. నిహారిక మరిన్ని సినిమాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్ సభ్యులు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
చిరంజీవి ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు వచ్చారు. నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడింది. ఆమె కోరిక మేరకు నాగబాబు ఆమె హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకున్నాడు. మెగా ఫ్యామిలీ నుండి ఆమెకు మద్దతు లభించింది. కాని పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. తన భర్తకు నేను హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదని ఇటీవలే నిహారిక చెప్పుకొచ్చింది. నిహారిక నిర్మాతగా మరియు ఫిల్మ్ మేకర్ గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్మాతగా మొదటి ప్రయత్నం సఫలం అవ్వడంతో ముందు ముందు ఈమె నుండి మరిన్ని సినిమాలు వస్తాయని అంతా నమ్మకంగా ఉన్నారు.