మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ తమకి ఇబ్బందులు కలిగిస్తున్నారని అపార్టుమెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్ నుంచి షేక్ పేట్ కు వెళ్లే దారిలో ఓ అపార్ట్‌మెంట్ లో నిహారిక దంపతులు ఫ్లాట్ అద్దెకు తీసుకుని.. తమ వృత్తిపరమైన పనుల కోసం ఉపయోగించుకునేవారు. అయితే రెసిడెన్షియల్ సొసైటీలో ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదని అపార్టుమెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగారు.
ఈ క్రమంలో చైతన్య వల్ల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటూ అపార్టుమెంట్ వాసులు బుధవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్య ఉండే ఫ్లాట్ కు గత కొన్ని రోజులుగా కొంతమంది యువకులు వస్తున్నారని.. మద్యం సేవించి హంగామా సృష్టిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో తమ ఆఫీస్ లోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని.. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్ వాసులు ఇబ్బందులు కలిగిస్తున్నారని చైతన్య సైతం పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఈ నేపథ్యంలో పరస్పర న్యూసెన్స్ ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. అపార్ట్‌మెంట్ లో మంగళవారం నాడు ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో ఇరువురినీ స్టేషన్ కు పిలిపించి పోలీసులు వారికి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఇరు వర్గాల వారు ఈ కేసులో రాజీకి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.