మెగా డాట‌ర్ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ బిగిన్స్‌

Update: 2020-12-03 04:15 GMT
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు.. మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక వెడ్డిండ్ హంగామా మొద‌లైంది. పెళ్లికి మ‌రో ఆరు రోజులు వుండ‌టంతో అప్పుడే మెగా ఫ్యామిలీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ‌ని ప్రారంభించేసింది.  గుంటూరుకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్‌ ర‌రావు త‌న‌యుడు జొన్ర‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో కొణిదెల నిహారిక వివాహం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

ఆగ‌స్టులో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. అప్పుడే డిసెంబ‌ర్‌ లో పెళ్లి అంటూ మెగా బ్ర‌ద‌ర్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 9న నిహారిక వివాహం రాజ‌స్థాన్‌ లోని ఉద‌య్‌ పూర్ ఉద‌య్ విలాస్ ‌లో జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం బ‌య‌టికి వ‌చ్చిన నిహారిక వెడ్డింగ్ కార్డ్ మెగా డాట‌ర్ వెడ్డింగ్‌ని మెగా ఫ్యామిలీ ఎంత గ్రాండ్‌ గా ప్లాన్ చేసింద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది.

ఇప్ప‌టికే ఉద‌య్‌పూర్‌ లోని ఉద‌య్ విలాస్‌ లో ఏర్పాట్లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. మెగా ఫ్యామిలీస్ అన్నీ ఉద‌య్‌పూర్ ఉద‌య్ విలాస్ ‌కు చేరుకుంటున్నాయి. ఇండ‌ప్ట్రీ నుంచి చాలా త‌క్కువ మందికి ఆహ్వానాలు అందాయి. పెళ్లి త‌రువాత హైద‌రాబాద్‌ లో గ్రాండ్ రిసెప్ష‌న్‌ ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే నిహారిక, చైత‌న్య‌ల వెడ్డిండ్ సెల‌బ్రేష‌న్స్ మొద‌లైంద‌ని మెగాస్టార్ చిన్న‌ల్లుడు క‌ల్యాణ్‌ దేవ్ ఇన్ ‌స్టాలో ఫొటోల‌ని షేర్ చేశారు. వీటికి నిస్చ‌య్ (నిహారిక - చైత‌న్య‌) అంటూ హ్యాష్ ట్యాగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అంటే విరుష్కా.. దీప్‌ వీర్ త‌రహాలో నిస్చ‌య్ అని హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నార‌న్న‌మాట‌.
Tags:    

Similar News