హైదరాబాద్ లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. అతివేగం ప్రమాదానికి మూల కారణం అయితే.. రోడ్డుపై మట్టి ఉండడం వలన బైక్ స్కిడ్ అయ్యిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
అతివేగంతోపాటు రోడ్డుపై మట్టి ఉండడంతో బైక్ స్కిడ్ అయ్యిందని.. సాయిధరమ్ తేజ్ ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోయాడని పేర్కొంది. డ్రైవింగ్ సమయంలో సాయిధరమ్తేజ్ హెల్మెట్ ధరించాడని పోలీసులు తెలిపారు. మద్యం సేవించలేదని నిర్ధారించుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో సాయిధరమ్ తేజ్ బైక్ 150 స్పీడ్ లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సాయిధరమ్ ను మెడికవరన్ ఆస్పత్రికి తరలించారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.
అపోలో ఆస్పత్రికి మెగా ఫ్యామిలీ మెంటర్స్ అంతా చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ ను మెడికవర్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. సాయితేజ్ కుటుంబ సభ్యులు చిరంజీవి, సురేఖ, నాగబాబు, పవన్ కళ్యాణ్,అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్ తదితరులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అపోలో ఎండీ సంగీత రెడ్డి కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. మరో 48 గంటల్లో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరింత క్లారిటీ ఇస్తామని వైద్యులు తెలిపినట్లు మెగా ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి పుకార్లకు తావు ఇవ్వకుండా ఆ ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. 'సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. కొన్ని గంటల్లోనే మామూలు పరిస్థితికి వస్తాడు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు. డాక్టర్లతో నేను మాట్లాడారు. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసి మిగిలిన వివరాలు తెలియజేస్తారని' అల్లు అరవింద్ అన్నారు.