`మా` ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సినిమా ట్విస్ట్ లని తలపించే స్థాయిలో రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. నామినేషన్ ల పర్వానికి ముందు నుంచే `మా` ఎన్నికల వేడి మొదలైంది. ఒకరంటే ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ `మా`ని రణరంగంగా మార్చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో హీరో మంచు విష్ణు పోటికి దిగుతున్నారు.
ఇప్పటికే ఇరు వర్గాలు తమ ప్యానెల్ లని ప్రకటించి నామినేషన్ అంకాన్ని కూడా ముగించారు. ప్రచారం జోరుగా మొదలుపెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒక వర్గాన్ని మరో వర్గం కించపరుచుకోవడం అనే పర్వానికి తెరలేపారు. మంచు విష్ణు వర్గానికి అండగా మాజీ అధ్యక్షుడు నరేష్ చక్రం తిప్పుతూ ప్రకాష్‌రాజ్ పై తీవ్ర ఆరోపణలకు దిగడం.. కొంత మందికి కోట్లల్లో డబ్బులు ఎగవేశాడని కేసులు వున్నాయని.. అలాంటి వ్యక్తి `మా` అధ్యక్షుడిగా పోటీ చేయడం ఏంటని కొత్త రాగం అందుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని ప్రకాష్ రాజ్.. తనని టార్గెట్ చేశారని జీవిత రాజశేఖర్ మీడియా కెక్కడంతో అదే తరహాలో మంచు విష్ణు.. నరేష్ కౌంటర్ ప్రెస్ మీట్‌లతో రసభాగా `మా` ఎన్నికలని మార్చేశారు. ఇదిలా వుంటే కొత్త ట్విస్ట్ కలవరానికి గురిచేస్తోంది. మెగా కాంపౌండ్ అండదండలతో ప్రకాష్ రాజ్ `మా` అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మెగా క్యాంప్ ప్రకాష్‌రాజ్ కు హ్యాండ్ ఇచ్చే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. మరో పక్క సీనియర్ లని ప్రసన్నం చేసుకుంటూ మంచు విష్ణు తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు.
ప్రకాష్‌రాజ్ పరభాషా నటుడు కావడంతో ఆయనకు ఏ సీనియర్ ఆర్టిస్ట్ నుంచి సరైన సపోర్ట్ లభించడం లేదు. మంచు విష్ణు ప్రచారంలో ముందుండటానికి ప్రధాన కారణం మోహన్ బాబు. ఆయనే నేరుగా సీనియర్ నటీనటులకు ఫోన్‌లు చేసి మంచు విష్ణుకి ఓటు వేయాలని చెబుతూ తన వైపుకు తప్పుకుంటున్నారట. పైగా మోహన్ బాబు గురించి బాగా తెలుసు కాబట్టి ఎవరూ పెద్దగా ఆయన మాటని తిరస్కరించడం లేదని చెబుతున్నారు.
మంచు విష్ణు .. కృష్ణంరాజు.. బాలకృష్ణలతో ఫొటోలని పంచుకుని తనకు వీరి సపోర్ట్ వుందని ప్రకటించాడు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం అలా ప్రకటించుకోలేకపోతున్నాడు. చిరు ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ గురించి స్పందించకపోవడంతో పలువురిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. చివరి నిమిషంలో మెగా ఫ్యామిలీ ప్రకాష్‌రాజ్ కు హ్యాండ్ ఇవ్వదు కదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఇటీవల ఓ నటి మెగాస్టార్‌ని కలిసి ఫొటో కోసం ప్రయత్నిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఇక ముందు నుంచి ప్రకాష్ రాజ్ కు మద్దతుగా వుంటున్న నాగబాబు తాజా పరిణామాల నేపథ్యంలో సైలెంట్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇంత జరుగుతున్నా మెగాస్టార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రకాష్‌రాజ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. చివరి నిమిషంలో మెగాస్టార్ తన స్టాండ్ ని మార్చుకుని మంచు విష్ణుని సపోర్ట్ చేసినా ఆశ్చర్యం లేదనేది ఇండస్ట్రీ వర్గాల్లో కొంత మంది వాదన. దానికి బలమైన కారణాన్ని కూడా చెబుతున్నారు. ఇప్పటి వరకు తను ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్టుగా చిరంజీవి ప్రకటించలేదు. పవన్ కల్యాణ్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక్క నాగబాబు తప్ప. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా గత కొన్ని రోజులుగా ఏమీ మాట్లాడటం లేదు. దీంతో ప్రకాష్ రాజ్ విషయంలో మెగా ఫ్యామిలీ బ్యాక్ స్టెప్ వేయడం ఖాయంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.