ఇద్దరు మాస్ మిత్రులకు మెగా అండ

Update: 2015-12-18 11:30 GMT
టాలీవుడ్ టాప్ మాస్ మూవీ డైరెక్టర్స్ లో టాప్ లో వినిపించే పేర్లు వివి వినాయక్ - శ్రీను వైట్ల. ఒకే తరహా సినిమాలు తీస్తారని విమర్శలు చుట్టుముట్టినా, తమకు అలవాటైన జోనర్ లోనే బంపర్ హిట్స్ కొట్టిన చరిత్ర ఈ ఇద్దరు మిత్రులది.

ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ కష్టాల్లో పడిపోయారు. అఖిల్ డిజాస్టర్ కావడంతో వివి వినాయక్ అసలు కనిపించడమే మానేశాడు. కోలుకోవడానికి టైం అడిగి, ఎవరినీ డిస్టర్బ్ చేయద్దని ఆర్డర్ కూడా పాస్ చేసేశాడని టాక్. అయినా సరే.. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ కత్తి రీమేక్ ని.. వినాయక్ చేతిలోనే పెడుతోంది మెగా ఫ్యామిలీ. అఖిల్ దెబ్బకు ఈ ప్రాజెక్ట్ చేజారిపోయినట్లే అందరూ అనుకుంటున్న టైంలో.. వినాయక్ తోనే కత్తి చేయబోతున్నట్లు చెర్రీ చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.  ఇక ఇదే మెగాపవర్ స్టార్ చెర్రీకి బ్రూస్ లీ లాంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ ని హిట్ ఇచ్చిన శ్రీను వైట్లకు కూడా..  మెగా ఫ్యామిలీ మరో అవకాశం ఇస్తోంది. వైట్ల నెక్ట్స్ మూవీ వరుణ్ తేజ్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు తగిన సరంజామా సిద్ధం చేసుకోవాలని కూడా చెప్పేశారట. స్టార్స్ తో సినిమా చేయడం ఇప్పట్లో కష్టమే అనుకునే టైంలో.. వైట్లకు ఇది బంపర్ ఆఫర్ అనే అనాలి.

అయినా.. చిరుకు అందరివాడు - చరణ్ కు బ్రూస్ లీ లాంటి ఫ్లాప్స్ ఇచ్చినా.. వైట్లకు మరో ఛాన్స్ ఇవ్వడం అంటే మెగా క్యాంప్ ఈ విషయంలో ఉదారంగా ఉన్నట్లే అనాలి. ఓ వైపు వినాయక్ కు చిరంజీవి సినిమా, మరోవైపు శ్రీను వైట్లకి వరుణ్ తేజ్ మూవీ ఇచ్చి.. కష్టాల్లో ఉన్న ఇద్దరు మిత్రులను మెగా ఫ్యామిలీ కంబైన్డ్ గా ఆదుకుంటోంది.
Tags:    

Similar News