అంటే అవార్డులు అనేవి క్రేజ్‌కు కొలమానాలు కాదు కాని.. ఒక్కోసారి అవార్డులు నటులను ఎంతో ఎంకరేజ్ చేస్తాయి. ముఖ్యంగా తదుపరి సినిమాల్లో ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అవి కూడా ప్రేరేపకాల్లా పనిచేస్తాయి. అందుకే మన హీరోలూ హీరోయిన్లూ డైరక్టర్లూ ఆర్టిస్టులూ ఈ అవార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే మెగా క్యాంపుకే వస్తుందని అనుకున్న ఓ అవార్డు అస్సలు రాకపోవడంతో.. మనోళ్ళు డిజప్పాయింట్ అయ్యారో లేదో కాని, ఫ్యాన్స్ మాత్రం బాగా డిజప్పాయింట్ అయ్యారు.
బెస్ట్ డెబ్యూ అవార్డు కోసం ఈసారి చాలామంది పోటీపడ్డారు. ముఖ్యంగా ముకుంద సినిమాతో తెర మీదకు వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, అలాగే పిల్లా నువ్వులేని జీవితం అంటూ రచ్చ చేసిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హులు అనుకున్నారు అభిమానులు. ఇకపోతే సంపూర్ణేష్ బాబు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి కలలే కన్నాడులే. కట్ చేస్తే.. ఎవ్వరూ ఊహించనట్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డును ఎగిరిపోయాడు. కోద్దోగొప్పో హిట్టయిన సినిమా ''అల్లుడు శీను''... బహుశా ఆ యాంగిల్‌లో చూస్తే శీను అన్ని విధాలా అర్హుడే మరి. మెగా ఫాన్స్ ఏమంటారో మరి.