అర డజన్ మంది మెగా హీరోలు టాలీవుడ్ లో సత్తా చాటేస్తున్నారు. రీసెంట్ గా అల్లు శిరీష్ కూడా హిట్ కొట్టేయడంతో.. మెగా హీరోలందరూ సక్సెస్ సాధించినట్లైంది. చిరు.. పవన్ లు పీక్స్ లోను.. ఆ నెక్ట్స్ లెవెల్ లో అల్లు అర్జున్ - రామ్ చరణ్.. ఆ తర్వాత తేజు-వరుణ్ తేజ్ లు.. చివరగా అల్లు శిరీష్ లు ఉన్నారు. అన్ని రేంజ్ ల సినిమాలు చేయగల హీరోలు ఉండడం మెగా ఫ్యామిలీకి మెయిన్ స్ట్రెంగ్త్.
అయితే కొన్ని నెలలుగా మెగాఫ్యాన్స్ మధ్య విబేధాలు కనిపిస్తున్న సంగతి వాస్తవమే. అయితే.. ఈ తరహా పరిణామాలతో ఆవేదన చెందిన కొందరు మెగాభిమానులు.. ఓ ఓపెన్ లెటర్ పోస్ట్ చేశారు. భారత దేశం కలిసికట్టుగా ఉండి శక్తివంతంగా ఉన్నపుడు విభజించి తర్వాత విదేశీయులు ఆక్రమించుకున్న పరిస్థితులు.. మెగాకుటుంబం మధ్య కూడా కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇటు మెగా హీరోలు.. అటు మెగా అభిమానులు చాలా శక్తివంతులని.. పలు సామాజిక కార్యక్రమాలతో ఛేదించలేనంత శక్తివంతంగా మారిపోవడంతో.. వారి మధ్య విషం చిమ్మి విబేధాలు కల్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని హెచ్చరించారు. ఈ అతి పెద్ద మెగా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అటు హీరోలకు.. ఇటు అభిమానులకు ఉందని ఆ లెటర్ గుర్తు చేసింది.
ఇక యువ హీరోలకు కూడా ఇందులో సుతిమెత్తగా చురకలు పడ్డాయి. ఎలాంటి విమర్శలు వచ్చినా.. చిరంజీవి - పవన్ కళ్యాణ్ లు చలించని వైనాన్ని గుర్తు చేసుకుని వారిలా ప్రవర్తించాలని.. మెగా హీరోలు గుర్తించాలని కోరారు. ఇది మన కుటుంబం.. మహా కుటుంబం.. మెగా కుటుంబం అంటు ముక్తాయించి.. చివర్లో కలహించేవాడు కాదు.. కలిసుండే వాడు మెగాభిమాని అంటూ ఫినిషింగ్ ఇచ్చిన తీరు అదరహో.