మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక సినిమా రంగంలోకి ప్రవేశించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్నేళ్లుగా ఈమె తన ఇష్టాన్ని చెబ్తున్నా ఆలోచనను పక్కన పెట్టిన నాగబాబు.. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చేశారు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైంది. ఈ నెల 30న జరగనున్న మూవీ స్టార్టింగ్ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీ హీరోలందరూ వస్తున్నారని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే నిహారిక ను రంగంలోకి దించొద్దంటూ మెగా ఫ్యాన్సు రచ్చ చేస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి ఇలా స్టార్ హీరోల కూతుళ్లు సినీరంగంలో ప్రవేశించడానికి అడ్డంకులు మన తెలుగు ఇండస్ట్రీలో ఎదురవుతాయి. ఇతర హీరోలతో రొమాన్స్ చేయాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో ఫ్యాన్స్ అబ్జెక్షన్స్ చెబుతుంటారు. గతంలో కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అయ్యేందుకు చాలా ప్రయత్నించింది. కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమాత్రం ఒప్పుకోకపోవడంతో.. ఆయన కూడా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. చివరకు షో అనే ప్రయోగాత్మక చిత్రంతోపాటు.. అప్పడప్పుడు గెస్ట్ తరహా పాత్రలు చేస్తూ ముచ్చట తీర్చుకోవాల్సి వచ్చింది.
అదే తమిళంలో చూసుకుంటే.. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న శృతిహాసన్ సినీరంగ ప్రవేశించడానికి.. తండ్రి కమల్ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా హీరోయిన్ గా వెలుగుతోంది. సీనియర్ నటుడు అర్జున్ తనయ ఐశ్వర్య కూడా హీరోయిన్ అయిపోయింది. ఇక బాలీవుడ్ లో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, సునీల్ శెట్టి కూతుర అథియా శెట్టి - ధర్మేంద్ర కూతురు ఈషాడియోల్ లు హీరోయిన్లుగా యాక్ట్ చేసేందుకు ఫ్యాన్స్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవలేదు.
కొడుకులను వారసులుగా గుర్తించి అక్కున చేర్చుకునే స్టార్ హీరోల ఫ్యాన్స్.. కూతుళ్ల విషయంలో కూడా ఇలాంటి ప్రవర్తననే ప్రదర్శిస్తే హుందాగా ఉంటుంది. తెలుగమ్మాయిలు హీరోయిన్లు కావడంలేదని బాధపడే బదులు.. ఇలా రావాలనే ఉత్సాహం ఉన్నవారిని ఆదరిస్తే.. ఆ కొరత కూడా తీరుతుంది. కుటుంబం నుంచి మద్దతు అందితే ఇంకా బావుంటుంది. ఇఫ్పుడు నీహారిక సినిమా లాంఛింగ్ ఫంక్షన్ కి చిరు వచ్చి ఆశీర్వదిస్తే.. ఓ కొత్త ఎపిసోడ్ స్టార్ అయినట్లే. మరి ఈ ఫ్యాన్సును ఆయన ఎలా సముదాయిస్తారో తెలియదు.